Indian Railways: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్వల్ప, మధ్యస్థ దూర రైలు ప్రయాణాన్ని మెరుగుపరచడానికి కొత్త తరం MEMU రైళ్లను అందుబాటులోకి తీసువచ్చేందకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో MEMU రైళ్లను తెలంగాణలో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. 16 నుంచి 20 కోచ్ లతో కూడిన కొత్త తరం మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైళ్లను కాజీపేటలోని రైల్ తయారీ యూనిట్ (RMU)లో నిర్మించనున్నట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముఖ్యంగా పండుగ సీజన్లలో నాన్ అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలకు ఈ రైళ్లు సేవలను అందించనున్నట్లు వెల్లడించారు.
కిషన్ రెడ్డికి చెప్పిన అశ్విని వైష్ణవ్
తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. కేంద్ర బొగ్గు మంత్రి కిషన్ రెడ్డికి కాజీపేటలో MEMU రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై చర్చించడానికి కిషన్ రెడ్డి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. ఈ సందర్భంగా స్వల్ప, మధ్యస్థ దూర రైలు ప్రయాణాన్ని మెరుగుపరచడానికి కొత్త తరం MEMU రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే భావిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డికి చెప్పారు. ఈ సందర్భంగా 16-20 కోచ్‌లతో కూడిన కొత్త MEMU రైళ్లను కాజీపేటలోని RMUలో తయారు చేస్తారని వెల్లడించారు.
కాజీపేటలో రూ. 716 కోట్లతో RMU ఏర్పాటు
కాజీపేటలో 160 ఎకరాల స్థలంలో రూ.716 కోట్ల వ్యయ అంచనాతో RMUను నిర్మిస్తున్నారు. దీనిని జనవరి 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మే 2026 నాటికి రైళ్ల తయారీ ప్రారంభం కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 2023లో కాజీపేట యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు బాధ్యతను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL)కి అప్పగించారు. ప్రారంభంలో నెలకు 200 వ్యాగన్ల పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ (POH) చేపట్టడానికి కాజీపేటలో వ్యాగన్ మరమ్మతు వర్క్ షాప్ ను మంజూరు చేశారు. అయితే, రైల్వే వ్యాగన్లకు పెరిగిన డిమాండ్, స్థానిక పరిశ్రమను ప్రోత్సహించడానికి తయారీ యూనిట్‌ను స్థాపించాలని పలువరు కోరడంతో, కాజీపేటలోని వ్యాగన్ మరమ్మతు సెంటర్ ను పూర్తి స్థాయి రైల్వే తయారీ యూనిట్ గా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Had a productive meeting with the Hon'ble Union Minister for Railways, Shri. @AshwiniVaishnaw ji in New Delhi.
Discussed various ongoing and proposed development initiatives in Telangana. Shri Vaishnaw ji shared that the GoI is set to introduce new generation Mainline Electric… pic.twitter.com/lFWdfBKii1
— G Kishan Reddy (@kishanreddybjp) June 25, 2025
Read Also: రూ.11కే విమాన ప్రయాణం.. విదేశాలకూ ఎగిరిపోవచ్చు!
స్థానికులకు ఉపాధి అవకాశాలు
కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ నిర్మాణం ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికతను సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన అడుగు కాబోతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైల్వే తయారీ యూనిట్ కాజీపేట యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు.