E-Paper
Advertisement

అగధ టీజర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచేసిన టీమ్!

అగధ టీజర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచేసిన టీమ్!
Advertisement

Agadha Teaser: ఈ మధ్యకాలంలో క్రైమ్ సస్పెన్షన్ థ్రిల్లర్ జానర్ లో చిత్రాలు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు ఎక్కువగా చేతబడి, డివోషనల్ నేపథ్యంలో వచ్చే సినిమాలు కూడా అంతే ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అలా సస్పెన్స్ తో పాటు క్యూరియాసిటీ పెంచేస్తూ టీజర్ తోనే ఊహించని అంచనాలు పెంచేశారు అగధ టీమ్.. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

కామాక్షి భాస్కర్ల అగధ టీజర్ రిలీజ్..

మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పై కాశీ విశాలాక్ష బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ్ , కన్నడ, హిందీ , మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. సినిమా పై అంచనాలు పెంచడమే కాకుండా ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతోంది. ముఖ్యంగా ఎవరు ఈ అగధ అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే అనే రేంజ్ లో అంచనాలు పెంచేశారు.

అగధ టీజర్ ఎలా ఉందంటే?

Advertisement

మరి టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఎగిసిపడే తలలు.. గుహలో రహస్యం.. అగధ ఎవరి మాట వినదు అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.” ప్రకృతిని ధాటి ఏర్పడే ఏ శక్తులనైనా.. మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం.. ఈ విశ్వంలో ఇది మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో అతీత శక్తులు కూడా దాగి ఉన్నాయి. కొన్ని రక్షించేవైతే.. కొన్ని వేదించేవి”.. అంటూ కామాక్షి భాస్కర్ల డైలాగ్ తో టీజర్ ప్రారంభించారు. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తున్నట్లుగా ఉంది. ముఖ్యంగా “ఆ వీడియోలో నువ్వు ఏం చూసావమ్మా?” అని అడిగితే ..ఆ అమ్మాయి భయంతో వణికి పోతుంది. సరిగ్గా మాట రాకుండా అగ్.. అగ్.. అగధ అని చెప్పడంతో అగధ అంటే ఎవరు అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అగధ ముందు ఎవరి ఆటలు సాగవు.. రా అగధ రా.. అనే డైలాగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాయ్ ముఖ్యంగా క్షుద్ర పూజలు.. తెగిపడే తలలు, అనుక్షణం ఉత్కంఠ , గుహలో అంతు చిక్కని రహస్యం.. ఇలా అన్ని అంశాలతో కూడిన ఒక పర్ఫెక్ట్ మిస్టీరియస్ థ్రిల్లర్ ను డైరెక్టర్ ఎంఎస్ రాజు రూపొందించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఒకప్పుడు ఒక్కడు, వర్షం, దేవి, మనసంతా నువ్వే వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన ఎమ్మెస్ రాజు తన స్టాండర్డ్స్ ని ఏ మాత్రం తగ్గించకుండా అంతకుమించి ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ అగధ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ALSO READ;‘పెద్ది’ ప్రమోషన్స్ ప్లాన్ సెట్.. రంగంలోకి ఆ ఇద్దరే!

Advertisement

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×