E-Paper
Advertisement

Allu Arjun: మెగాస్టార్ నే బీట్ చేసిన బన్నీ.. షాక్ లో మెగా ఫాన్స్!

Allu Arjun: మెగాస్టార్ నే బీట్ చేసిన బన్నీ.. షాక్ లో మెగా ఫాన్స్!
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పుష్ప సినిమాతో ఎలా అయితే పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారో.. ఇక పుష్ప 2 తర్వాత ఆయన రేంజ్ ఒక లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమా క్రియేట్ చేసిన హిస్టరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మాస్, యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతి ఎలిమెంట్లో కూడా తన విశ్వరూపాన్ని చూపించాడు. పైగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది.

మరో ఫిలింఫేర్ అవార్డు అందుకున్న బన్నీ..

ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ నటనకు మెచ్చి పుష్ప 2 సినిమాకు గాను మరోసారి ఫిలింఫేర్ అవార్డు లభించడం విశేషం . ఈ సినిమాలో తన నటనకు గానూ బెస్ట్ యాక్టర్ గా ఈ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఇకపోతే ఇది ఆయన కెరియర్ లో ఏడవ ఫిలింఫేర్ అవార్డు కావడం గమనార్హం. యంగ్ హీరోలలో ఇన్ని ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచారు. ఇకపోతే తాజాగా జరిగిన 70వ ఫిలింఫేర్ ఉత్సవాలలో భాగంగా అవార్డుతో దిగిన ఫోటోని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇన్ని అవార్డ్స్ అందుకున్న మిగతా హీరోల జాబితా సోషల్ మీడియాలో సర్చ్ చేయగా ఆయన.. తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) రికార్డును సమం చేశాడని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి రికార్డును బ్రేక్ చేస్తూ..

Advertisement

విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన అద్భుతమైన నటనతో తన కెరియర్లో ఇప్పటివరకు 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. పుష్ప 2 కోసం అందుకున్న ఫిలింఫేర్ అవార్డుతో అటు అల్లు అర్జున్ కూడా మెగాస్టార్ రికార్డును సమం చేశాడు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. అతి తక్కువ సమయంలోనే బన్నీ ఈ ఫీట్ ని సాధించడం అంటే మామూలు విషయం కాదు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అటు మెగా అభిమానులు మాత్రం ఈ విషయంలో కాస్త షాక్ కి గురైనా.. అల్లు అర్జున్ నటనకు మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అల్లు అర్జున్ సినిమాలు..

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ(Atlee) దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా 2027 సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మరొకవైపు తన తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా బిజీగా మారిన విషయం తెలిసిందే.

Advertisement

also read: Actor RajaSekhar: రామ్ చరణ్ హిట్ మూవీ.. అడిగిన ఛాన్స్ ఇవ్వలేదు – రాజశేఖర్

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×