E-Paper
Advertisement

Actress Meena: అప్పటినుంచి ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నా -మీనా

Actress Meena: అప్పటినుంచి ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నా -మీనా
Advertisement

Actress Meena: సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఎంతోమంది తమ కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు. ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తమను తాము నిరూపించుకోవడానికి సమయం పడుతుంది. కొంతమందికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే అదృష్టం తలుపుతడితే.. మరికొంతమంది ఆ అదృష్టం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. ఈ ఎదురుచూపుల సమయంలో కుటుంబానికి కూడా దూరం కావాల్సి వస్తుంది. అటు కుటుంబం ఇటు సన్నిహితులు, బంధువులు అందరిని చాలా మిస్ అవుతూ ఉంటారు..

సినిమా మోజులో కుటుంబాలను మిస్ అవుతున్న సెలబ్రిటీలు..

ఇక పండుగలు వచ్చాయి అంటే చాలు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపితే.. సెలెబ్రిటీలు మాత్రం ఎక్కడో తమ సినిమా షూటింగ్ల కారణంగా సినిమా వాళ్లతోనే సెలబ్రేట్ చేసుకునే రోజులు కనిపిస్తూనే ఉంటాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నామనే వేదన వారిలో బయటకు కనిపించకపోయినా
. మనసులో మదన పడుతూనే ఉంటారు. అయితే ఈ విషయంలో తాను కూడా అలాగే కృంగిపోయానని.. కానీ అమ్మవల్లి అప్పటినుంచి ప్రతి రోజును ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పు చెప్పుకొచ్చింది సీనియర్ నటీమణి మీనా(Meena ). ఇక తాను కూడా అందరిలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కుటుంబాన్ని మిస్ అవుతున్నాను అనే భావన ఎక్కువగా ఉండేదని. కానీ ఆ తర్వాత కాలంలో తనలో కలిగిన మార్పును స్వీకరించి ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తనకి కూడా ఆ ఆవేదన తప్పలేదంటున్న మీనా..

Advertisement

విషయంలోకి వెళ్తే ..చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు, తమిళ్ చిత్రాలలో బాలనటిగా నటించి, మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. రజినీకాంత్, కమలహాసన్, చిరంజీవి, వెంకటేష్ తదితర నటులతో నటించిన ఈమె కథానాయికగా ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. ముత్తు సినిమాతో జపాన్లో ఇప్పటికీ ఫేవరెట్ హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగిన ఈమె.. వెంకటేష్ తో కలసి సుందరకాండ ,చంటి, సూర్యవంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన చిత్రాలు చేసి మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ జోడిగా పేరు దక్కించుకుంది.

కెరియర్ పీక్స్ లో ఉండగానే భర్తను కోల్పోయిన మీనా..

వృత్తిపరంగా కెరియర్ పీక్స్ లో ఉండగానే.. 2009లో వివాహం చేసుకుంది. ఇక వివాహం జరిగిన 13 ఏళ్ల తర్వాత అనగా 2022లో ఈమె భర్త విద్యాసాగర్ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ఇక అప్పటి నుంచి కూతురు నైనికతో కలిసి జీవిస్తున్న ఈమె ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కొంతమంది ఆకతాయిలు అదేపనిగా టార్గెట్ చేసుకొని ఫలానా హీరోను పెళ్లి చేసుకోబోతోంది అంటూ పలు రకాల రూమర్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న మీనా రెండో పెళ్లి వార్తలపై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒంటరిదాన్ననే కదా మీ ఆకతాయి పనులు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అదే ఇంటర్వ్యూలో నటిగా తన జ్ఞాపకాలను పంచుకుంది.

అప్పటినుంచి ఎంజాయ్ చేస్తున్నా – మీనా

Advertisement

“ఒకప్పుడు వరుస షూటింగ్ లతో పండుగలకు కూడా ఇంటికి వెళ్లలేక బాధపడేదాన్ని. అయితే ఆ సమయంలో మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది. కొత్త దర్శకులు, నటీనటులు, ప్రదేశాలతో గడిపే అవకాశం అందరికీ రాదు అని.. మా అమ్మ చెప్పిన మాటలను నేను గుర్తు పెట్టుకొని ఇక ఆ రోజు నుంచి ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను” అంటూ మీనా తెలిపింది. మొత్తానికైతే ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ ముందుకు వెళ్లే మీనా అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కామెంట్లు చేసింది. అయితే అలాంటి ఈమెపై ఇలా సెకండ్ మ్యారేజ్ వార్తలు రావడం నిజంగా బాధాకరం అని చెప్పాలి.

 

also read: Allu Arjun: మెగాస్టార్ నే బీట్ చేసిన బన్నీ.. షాక్ లో మెగా ఫాన్స్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×