Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. నటుడుగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ హీరోగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు తన అల్లు సామ్రాజ్యాన్ని ఇండస్ట్రీలో విస్తరిస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణ రంగంలో దూసుకెళ్తున్నారు అలాగే అల్లు స్టూడియోస్ కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అల్లు సినిమాస్ ప్రారంభించి థియేటర్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు.
ఆసియాలోనే అతిపెద్ద మూడవ థియేటర్ గా అల్లు సినిమాస్ పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంది. అత్యాధునిక హంగులతో కోకాపేటలో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోస్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్టూడియోలో వాల్ ఆఫ్ గ్రేట్ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఒక గోడపై ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ల ఫోటోలతో ఏర్పాటు చేయబడి ఉంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియోలో భాగంగా రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి, అట్లీ, రిషబ్ శెట్టి,లిజో జోస్ పెల్లిస్సెరీ, రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ వంటి తదితరులు ఫోటోలు ఉన్నాయి. ఈ వీడియో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ పై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఇలా డైరెక్టర్ల ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వడంలో తప్పులేదు కానీ వీరికంటే ఎంతో గొప్ప దర్శకుల చిత్రపటాలను అక్కడ ఏర్పాటు చేయకపోవడంతో విమర్శలు కురిపిస్తున్నారు.
డైనమిక్ డైరెక్టర్ ను ఎలా మర్చిపోతావ్?
తెలుగు చిత్ర పరిశ్రమలో కె.వి.రెడ్డి విఠలాచార్య రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, జంధ్యాల, బాపులాంటి సీనియర్ దర్శకుల ఫోటోలు ఉంటే మరింత బాగుండేది అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ లాంటి డైనమిక్ డైరెక్టర్ ను ఎలా మర్చిపోతారు? సంచలన దర్శకులు ఆర్జీవీ ఎక్కడ? శంకర్ ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ తరం డైరెక్టర్లను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇలా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు కానీ ఇంకా గొప్ప గొప్ప దర్శకులను మర్చిపోవడం విడ్డూరంగా ఉంది. అయితే మరి కొంతమంది ఈ విషయంలో బన్నీని సమర్థిస్తున్నారు. దర్శకులు అందరి ఫోటో గ్యాలరీ కాకుండా ఆయన నటించాలనుకుంటున్న డైరెక్టర్ల గ్యాలరీ మాత్రమే ఏర్పాటు చేసి ఉండవచ్చు కదా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Monalisa -Farman khan: మోనాలిసా భర్త ఫార్మన్ ఖాన్ కూడా నటుడా .. అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే?