E-Paper
Advertisement

Donald Trump: పిచ్చిగా ప్రవర్తిస్తే ఇక ఏం మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: పిచ్చిగా ప్రవర్తిస్తే ఇక ఏం మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పాలకులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారాయి. పిచ్చిగా ప్రవర్తించే ఇరాన్ నేతలకు ఏం జరుగుతుందో త్వరలోనే ప్రపంచం చూస్తుందని ఆయన హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. అగ్రరాజ్యం శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయవద్దని ఆయన గట్టిగా చెప్పారు.

ఇరాన్ సైనిక విభాగాలపై ట్రంప్ నేరుగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అమెరికా సైనిక చర్యల ధాటికి ఇరాన్ నావికా దళం కనుమరుగైందని పేర్కొన్నారు. కేవలం నౌకాదళం మాత్రమే కాదు.. భవిష్యత్తులో ఇరాన్ వైమానిక దళం కూడా ఉండదని ఆయన జోస్యం చెప్పారు. తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యకైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్ వైమానిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసే సత్తా అమెరికాకు ఉందని ఆయన చెప్పారు.

Advertisement

చరిత్రలో ఏ దేశం దెబ్బతిననంత తీవ్రంగా తాము ఇరాన్‌ను దెబ్బతీశామని ట్రంప్ ప్రకటించారు. ఆర్థికంగా.. సైనికంగా ఆ దేశం వెనుకబడిపోయేలా తమ వ్యూహాలు ఉన్నాయని వివరించారు. ఇరాన్ అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల ఆ దేశం ఇప్పటికే భారీ నష్టాన్ని మూటగట్టుకుందని చెప్పారు. ప్రపంచ దేశాల శాంతికి విఘాతం కలిగిస్తున్న ఇరాన్ నాయకత్వం తగిన ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. అమెరికా ఆంక్షలు సైతం ఆ దేశాన్ని కోలుకోలేని స్థితికి చేర్చాయని ఆయన గుర్తు చేశారు.

ప్రపంచానికి కలిగిస్తున్న నష్టానికి ఇరాన్ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటోందని ట్రంప్ వెల్లడించారు. ఉగ్రవాదానికి వత్తాసు పలుకుతూ అంతర్జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తున్న ఇరాన్‌ను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇరాన్ తన పద్ధతిని మార్చుకోకపోతే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. అమెరికా ప్రయోజనాలే తమకు పరమావధి అని.. తమ మిత్రదేశాల రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ గా మారాయి.

Advertisement

ALSO READ: Indian Army: ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంటున్నారా..? ఇదే మంచి అవకాశం, ఇంకెందుకు ఆలస్యం

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×