E-Paper
Advertisement

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!
Advertisement

Allu Arjun Fans Association: సాధారణంగా ప్రతి ఒక్క హీరోకి ఎంతోమంది అభిమానులు ఉంటారు ఇలా అభిమానులు అంటే వారి సినిమాలు విడుదలైనప్పుడు వారి పుట్టినరోజు సమయంలో బ్యానర్లు కట్టి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఫ్యాన్స్ అంటే బ్యానర్లు కట్టి సెలబ్రేషన్స్ చేసేవారు మాత్రమే కాదు సామాజిక బాధ్యతతో కూడుకున్న వారు అంటూ నిరూపించారు. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

8 రాష్ట్రాలు, 820 సదస్సులు..

ఇకపోతే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు సామాజిక బాధ్యతతో ఒక మంచి పని చేయాలని శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే హెచ్ పి వి వ్యాక్సిన్(HPV Vaccine) గురించి అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇటీవల సర్వైకల్ క్యాన్సర్లు పెరుగుతున్న నేపథ్యంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ద్వారా వాటిని ఎంతవరకు నియంత్రించవచ్చు అనే విషయాలను తెలియచేస్తూ అందరిలో అవగాహన తీసుకువస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఈ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఏకంగా 8 రాష్ట్రాలలో ఏకంగా 820 సదస్సులను నిర్వహించినట్టు తెలుస్తుంది.

3 లక్షల మంది బాలికలకు అవగాహన..

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA). కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాల ద్వారా సుమారు మూడు లక్షల మంది అమ్మాయిలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతను చేరవేశారు.

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ కాదు .. సామాజిక బాధ్యత..

హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణ పట్ల అవగాహన కల్పించడం బాలికలకు యువతులకు ఆరోగ్యమైన భవిష్యత్తును అందించడంలో తమ వంతు ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్ అంటే కేవలం సెలబ్రేషన్స్ చేయడం మాత్రమే కాదు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవడం అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరూపించారని వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా దాదాపు షూటింగ్ 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కావడంతో రాకా పై భారీగా అంచనాలు ఉన్నాయి.

Advertisement

Also Read: ‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

Related News

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

ఇరుముడి ఊచకోత.. ఇప్పటివరకు వచ్చింది ఎంతో తెలుసా ?

Big Stories

Advertisement
×