BRS Leaders: స్వేచ్ఛ బ్యూరో: శాసనసభ సమావేశాలు నాలుగోరోజూ కొనసాగనున్నాయి. అయితే బీఆర్ఎస్ శాసనసభ్యులు బుధవారం సభకు హాజరైనవారిని సస్పెండ్ చేశారు. మిగిలిన సభ్యులు సభ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది. మాజీ మంత్రులు చామకూర మల్లారెడ్డి, టి. పద్మారావు గౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అసెంబ్లీకి గురువారం వస్తారా లేదా అన్న అంశంపైనే సొంత పార్టీలో ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ ‘ముగ్గురు నేతలు’ ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం మూడురోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. అయితే పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో వీరు మాత్రమే సభకు రాకపోవడంతో సస్పెన్షన్ కు గురికాలేదు. సభలో పార్టీకి అనుకూలంగా గళం విప్పుతారా? లేక కాంగ్రెస్ పట్ల మృదువైఖరి ప్రదర్శిస్తూ మౌనంగా ఉండిపోతారా? అనే అంశం చర్చమొదలైంది. క్షేత్రస్థాయిలో గులాబీ కార్యకర్తలు సైతం సభ వైపు ఉత్కంఠగా చూస్తున్నారు.
Also read: తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ దళిత్ వర్సెస్ దొరలు.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!
ప్రతిపక్ష నేత కేసీఆర్ లక్ష్యంగా అధికార పక్షం చేస్తున్న తీవ్ర విమర్శలను ఈ ముగ్గురు నేతలు సభ వేదికగా ఖండిస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది.ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, నాయకులపై అధికార పార్టీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారాన్ని వీరు సభలో ఎండగడతారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే అధిష్టానం పిలుపునిచ్చే నిరసనలు, వాకౌట్లలో ఈ ముగ్గురు నాయకులు భాగస్వాములవుతారా? లేక సభలోనే వేరే సమీకరణాలకు తెరలేపుతారా? అన్నది చూడాలి.
ఒకవేళ వీరు సభకు దూరంగా ఉన్నా, లేదా సభలో మౌనం వహించినా అది పార్టీకి అంతర్గతంగా నష్టం చేకూరుస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. సమావేశాలకు ఈ ముగ్గురి హాజరుపై స్పష్టత రాలేదు. ఏది ఏకమైనప్పటికీ ఈ ముగ్గురిపై అటు పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చజరుగుతుంది. మరోవైపు సభకు రాకపోయినా మాజీమంత్రి గంగుల కమలాకర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారా? తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి సభ వ్యహరిస్తుందా? అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.
Alson read: శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!