E-Paper
Advertisement

ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!

ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!
Advertisement

Plastic Stool Hole: ఈ రోజుల్లో ప్లాస్టిక్ స్టూళ్లు.. మన ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు, వేడుకలలో అత్యవసరంగా మారిపోయాయి. అయితే వీటిని గమనిస్తే.. సీటు మధ్యలో చిన్న రంధ్రం తప్పనిసరిగా ఉంటుంది. చాలామంది ఈ రంధ్రం.. కేవలం పట్టుకోవడానికో, డిజైన్ కోసమే పెట్టారని అనుకుంటారు. కానీ ఆ చిన్న రంధ్రం వెనుక ఎన్నో ఆసక్తికరమైన ఉపయోగాలు దాగున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

వ్యాక్యూమ్ సమస్యకు చెక్

సాధారణంగా స్టూళ్లను ఒకదానిపై ఒకటి అమర్చి ప్లేస్ ఆదా చేయడం అందరూ చేసేదే. ఒకవేళ మధ్యలో రంధ్రం లేకపోతే, రెండు స్టూళ్ల మధ్య గాలి బంధించబడి ‘వ్యాక్యూమ్’ ఏర్పడుతుంది. దీనివల్ల అవి ఒకదానికొకటి గట్టిగా అతుక్కుపోయి, విడదీయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మధ్యలో ఉండే రంధ్రం గాలి ప్రసారానికి దోహదపడి ఈ సమస్యకు చెక్ పెడుతుంది.

బరువును తట్టుకునే సామర్థ్యం

Advertisement

అయితే ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో రంధ్రం పెట్టడం వల్ల దాని బలం తగ్గుతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. సరైన నిష్పత్తిలో గుండ్రటి ఆకారంలో ఉండే ఈ రంధ్రం.. స్టూల్ పైభాగంలో ఒత్తిడి సమంగా విస్తరించేందుకు సహాయపడుతుంది. ఒక వ్యక్తి స్టూల్‌పై కూర్చున్నప్పుడు పడే బరువు ఒకే చోట కేంద్రీకృతమవ్వకుండా ఆ బలం నలువైపులా ఉన్న కాళ్లకు సమానంగా బదిలీ అయ్యేలా ఈ డిజైన్ తోడ్పడుతుంది.

తయారీలో లోపాలు రాకుండా..

ప్లాస్టిక్ స్టూళ్లను ‘ఇంజెక్షన్ మోల్డింగ్’ అనే ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ముందుగా వేడి వేడి లిక్విడ్ ప్లాస్టిక్‌ను మోల్డ్ లోకి పంపి చల్లార్చుతారు. అయితే ప్లాస్టిక్ భాగాలు మందంగా ఉంటే చల్లారేటప్పుడు ముడుచుకుపోవడం, వంగిపోవడం వంటి లోపాలు జరుగుతాయి. కాబట్టి సీటు మధ్యలో రంధ్రం ఉంచడం వల్ల ప్లాస్టిక్ సమానంగా చల్లబడి స్టూల్ సరైన ఆకారంలో ఫినిష్ అయ్యేందుకు సాయపడుతుంది.

నీరు నిలవకుండా క్లీనింగ్

Advertisement

బాత్రూమ్‌లలో, అవుట్‌డోర్ ప్రదేశాల్లో లేదా కడిగే సమయంలో స్టూళ్లపై నీరు చేరడం సహజం. మధ్యలో రంధ్రం ఉండటం వల్ల ఆ నీరు సీటుపై నిలవకుండా కిందకు వెళ్లిపోతుంది. దీనివల్ల స్టూళ్లు త్వరగా ఆరడమే కాకుండా పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు వాటిని శుభ్రం చేయడం, మెయిన్ టేన్ చాలా సులువవుతుంది.

Also Read: నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

తయారీ వ్యయం తగ్గుదల

ఈ రంధ్రం వల్ల మరో కీలక బెనిఫిట్.. ప్లాస్టిక్ ఆదా అవ్వడం. స్టూళ్లను లక్షల్లో ఉత్పత్తి చేసే కంపెనీలకు ఒక్కో స్టూల్ నుండి కొద్దిగా ప్లాస్టిక్ తగ్గినా భారీ మొత్తంలో ముడిసరుకు ఆదా అవుతుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. మెుత్తంగా ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య ఉండే చిన్నపాటి రంధ్రం అటు యూజర్లకు ఇటు తయారీ దారులకు విభిన్నమైన ప్రయోజనాలను చేకూరుస్తున్నట్లు చెప్పవచ్చు.

Also Read: ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Tags

Related News

మాత్రను నోట్లో వేసుకుని నీళ్లు తాగాలా? లేదా నీళ్లతోపాటు మాత్ర వేసుకోవాలా? ఏది డేంజర్?

అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. రూ.46 లక్షల సాలరీ.. అన్నీ వదిలి ఇండియన్ ఆర్మీలోకి

బిడ్డకు ఆకలి వేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులకు రెస్పాన్సివ్ ఫీడింగ్ గైడ్

మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ

పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ

పిల్లలు ఇంటి గోడలపై డ్రాయింగ్ వేస్తూ పాడు చేశారా? నో టెన్షన్ క్రేయాన్ మరకలు క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్ ఇవిగో

Big Stories

Advertisement
×