E-Paper
Advertisement

Allu Arjun: మితిమీరిన అభిమానం.. బన్నీకి చేదు అనుభవం..

Allu Arjun: మితిమీరిన అభిమానం.. బన్నీకి చేదు అనుభవం..
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun) పుష్ప, పుష్ప2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో తన 22వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ప్రముఖ కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పైగా హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. పైగా రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు. మరొకవైపు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 3వ తేదీన వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సంబంధించి టైటిల్ ను రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ను కూడా పంచుకున్నారు మేకర్స్.’గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ తో ఆ సినిమా చేయబోతున్నారు బన్నీ.

బన్నీని అందలం ఎక్కిస్తున్న అభిమానులు..

ప్రస్తుతం అట్లీ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న బన్నీకి తాజాగా చేదు అనుభవం ఎదురయింది. నిజానికి బన్నీకి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనపై ఈగ వాలనివ్వకుండా చూసుకుంటారు ..ఆయనను ఎవరైనా ఏమైనా అంటే సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ రెచ్చిపోతున్నారు. అంతేకాదు బన్ని విషయంలో జోక్యం చేసుకున్న రాజకీయ నాయకులను కూడా ట్రోల్స్ చేసిన సందర్భాలు బోలెడు. అలాంటి అభిమానుల కారణంగానే ఇప్పుడు బన్నీకి చేదు అనుభవం ఎదురవడం సంచలనగా మారింది.

అభిమానుల మధ్య బన్నీకి చేదు అనుభవం..

Advertisement

తాజాగా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి తో కలిసి హైదరాబాద్ హైటెక్ సిటీ లోని నీలోఫర్ కేఫ్ కి వెళ్లారు. అసలే ఐకాన్ స్టార్. బయటకు సాదాసీదా మనిషిలా వెళితే అభిమానులు వూరుకుంటారా? ఇంకేముంది ఆయనతో సెల్ఫీలు దిగడానికి.. ఆయనతో కరచాలనం చేయడానికి ఎగబడ్డారు. అభిమానుల తాకిడి తట్టుకోలేక అతి కష్టం మీద బన్నీ తన భార్యను తీసుకొని బయటకు వచ్చేసారు. అయితే కారు ఎక్కడానికి కూడా అభిమానులు ఆయనకు చాన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అందుకు సంబంధించిన వీడియోలలో మనం చూడవచ్చు. మొత్తానికైతే అభిమానులు కారణంగా బన్నీ ఇబ్బందులు పడడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

also read:Bharathiraja: ఐసీయూలో స్టార్ డైరెక్టర్.. మొన్న కొడుకు మరణం.. నేడు..

హాలీవుడ్ మార్కెట్ దక్కించుకునే దిశగా అడుగులు..

Advertisement

అల్లు అర్జున్ విషయానికి వస్తే మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ఆ తర్వాత తన నటనతో , డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఐకాన్ స్టార్ గా , పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్న బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జాన్వీకపూర్ , రష్మిక మందన్న లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ఎలాగైనా సరే హాలీవుడ్ రేంజ్ లో మార్కెట్ దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

 

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×