E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు.. విశ్వం దెబ్బకు మైండ్ బ్లాక్..రామారాజుకు టెన్షన్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు.. విశ్వం దెబ్బకు మైండ్ బ్లాక్..రామారాజుకు టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్య అమాయాకురాలు ఎవరో సపోర్ట్ చేశారు. విశ్వంను ప్రేమించమని ఎవరో చెప్పారు లేకుంటే తెలియదని ప్రేమ నర్మదా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమూల్య ప్రేమించడానికి ఎవరో ఒకరు సాయం చేస్తుంటారు. అది ఎవరో తెలుసుకుంటే అమూల్య ప్రేమలో ఎలా పడిందో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనం కనిపెట్టొచ్చు అని ప్రేమ నర్మదా అంటారు. ఆ మాట వినగానే వల్లి   వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. ఇదంతా చేసింది శ్రీవల్లిని అని ప్రేమకు అనుమానం వస్తుంది.

అమూల్యకు సాయం చేసిన వారి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఈ టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నావు అని ప్రేమ అంటుంది.. కొంపతీసి నువ్వే అమూల్యకు సాయం చేస్తావా అని అడుగుతుంది.. నేనెందుకు అలా చేస్తాను పోయి ఆ ఇంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడతానని శ్రీవల్లి అంటుంది. ఈ టాపిక్ ని ఎందుకు నువ్వు డైవర్ట్ చేస్తున్నావో అర్థం కావట్లేదు అని ఇద్దరు తెలివిగా శ్రీవల్లిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అమాయకురాలైన నన్ను ఇన్ని మాటలు అంటారా అని శ్రీవల్లి అంటుంది.. ఏం చేస్తావో మాకు తెలియదు అమూల్య పెళ్లి గురించి అందరూ ఒప్పుకునేలా చేయాలని శ్రీవల్లిని నర్మదా అడుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇప్పుడు ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కదా.. వారందరినీ మళ్లీ సంతోషంగా ఉండేలా చేయాలని అంటుంది. నర్మదా ఇలా చేయకపోతే కచ్చితంగా నీ బండారం బయటపడుతుంది అని అనగానే.. శ్రీవల్లి చేసేదేమీ లేదు అని ఇంట్లోనే వాళ్ళని పిలిచి అమూల్య పెళ్లి కదా అందరం సంతోషంగా ఉందామని అంటుంది. అమూల్య కొద్ది రోజులు వెళ్ళిపోతుంది కదా మనం అందరితోపాటుగా సంతోషంగా ఉండాలి అని అంటుంది. మొదట వల్లి ఏమంటుందో అర్థం కాకపోయినా కానీ తర్వాత మాత్రం అందరూ వల్లి మాటే నిజమని అనుకుంటారు.. ఆ తర్వాత రామరాజు ఒప్పుకోవడంతో అందరితో శ్రీవల్లి అంతాక్షరి పెడుతుంది.

ఇంట్లోని వాళ్ళందరూ కూడా సరదాగా పాటలు పాడుతూ ఉంటారు. అమూల్య పెళ్లి కాబట్టి అందరూ సన్నగా ఉండాలని అనుకుంటారు.. ఆ తర్వాత వీళ్ళందరూ పాటలు పాడుతూ సరదాగా ఉంటుంటే భాగ్యం ఆనందరావు ఇంట్లోకి సడన్గా ఎంట్రీ ఇస్తారు. ఏంటి మీరిద్దరూ సడన్గా ఇలా ఊడిపడ్డారు అని శ్రీవల్లి అంటుంది.. ఏం లేదమ్మా ఇంట్లో పెళ్లి కదా అందుకే వచ్చాము అని భాగ్యం అంటుంది.. మీరు మమ్మల్ని పిలవకపోయినా మేం మాత్రం రావాలి కదా తప్పదు కదా అని భాగ్యం ఆనందరావు అంటారు.. కానీ రామరాజు మాత్రం పెళ్లి చూపులే కదమ్మా పెళ్లికి దగ్గరుండి మీరే చూసుకోవాలి కదా అని అంటాడు..

Advertisement

మీరు కంటిన్యూ చేయండి మా అమ్మ వాళ్ళతో నేను కాసేపు బయట అరుగు మీద కూర్చుని మాట్లాడి వస్తాను అని శ్రీవల్లి వాళ్ళని బయటికి బలవంతంగా లాక్కొని వెళ్తుంది.. అమూల్య పెళ్లి అయ్యేంతవరకు నిన్ను ఈ పక్కకు రావద్దని చెప్పాను కదా. మరి ఎందుకు మీరిద్దరూ ఇట్లా వచ్చారు అని శ్రీవల్లి సీరియస్ అవుతుంది.. ఒకసారి అటు చూడు అని విశ్వంను చూపిస్తుంది భాగ్యం.. నేను మీ గురించి అడుగుతుంటే మీరేంటి ఆ ఎదవని చూపిస్తున్నారు అని శ్రీవల్లి అడుగుతుంది.. ఏం జరిగిందో తెలియాలంటే ఒకసారి ఫ్లాష్ ప్యాక్ లోకి వెళ్లాల్సిందే అని భాగ్యం అంటుంది..

మేము ఈ ఊరుని వదిలి వెళ్ళిపోవాలని తట్ట బుట్ట సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా ఆ విశ్వం కనిపించాడు.. ఏంటి ఊరు వదిలి పారిపోతున్నారా అని అడిగాడు.. అదేం లేదు అని మేము ఎంత చెప్తున్నా సరే అతను మాత్రం నమ్మలేదు. మాకు మూడు ఆప్షన్లు ఇచ్చాడు. ఊరు నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఆప్షన్ ని మీరు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని అన్నాడు. మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని అర్థమైంది అందుకే అతను చెప్పినట్టు మేము వినాల్సి వచ్చింది అని జరిగిన విషయం అంత భాగ్యం శ్రీవల్లితో చెప్తుంది.

Also Read : గుడ్ న్యూస్ చెప్పిన శ్రీయ.. పల్లవికి షాక్.. అవనికి నిజం తెలుస్తుందా..?

కాలికి పోయే తీగని ఇలా తగిలించుకోవడం అంటే ఇదే.. నా నెత్తిన తెచ్చిపెట్టారు ఇప్పుడు నేను బాధపడాలి అని శ్రీవల్లి అంటుంది.. ఆ తర్వాత రామరాజు పెళ్లి చూపులు వాళ్ళు వస్తున్నారని వేదవతి తో అంటాడు. ఈ పెళ్లి జరిగితే అమూల్య జీవితం బాగుంటుంది అని అంటాడు.. అయితే అమూల్య సంతోషం కన్నా మనకు ఏం కావాలండి మీరు ఎలా చెప్తే అలానే చేద్దాం అని వేదవతి అంటుంది. ఆ తర్వాత తిరుపతి తన సౌందర్య లహరి తో ఫోన్ మాట్లాడుతాడు.. అతను మాట్లాడడం వినిన అల్లుళ్ళు ఆటపట్టిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×