E-Paper
Advertisement

Sankranthi: షాకింగ్.. సంక్రాంతి పండుగ తేదీలు మారాయి.. పందెం రాయుళ్లకు టెన్షన్..

Sankranthi: షాకింగ్.. సంక్రాంతి పండుగ తేదీలు మారాయి.. పందెం రాయుళ్లకు టెన్షన్..
Advertisement

Sankranthi: ఏపీలో సంక్రాంతి పండుగ హడావిడి మొదలైంది. సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలతో పాటుగా మరికొన్ని చోట్ల జరిగే కోడి పందాలు. అయితే ఈ సంవత్సరం పండుగ తేదీల్లో కాస్తా మార్పులు రావడంతో పందెం రాయుళ్లు కాస్తా షాక్‌కు గురయ్యారు సాధారణంగా.. లీపు సంవత్సరం కాకపోతే సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం లీపు సంవత్సరం కాకపోయినా.. పండితులు మాత్రం లీపు సంవత్సరంలో వచ్చే తేదీలైన జనవరి 14, 15, 16 తేదీల్లో పండుగ జరుపుకోవాలని లెక్కించారు.

2026లో సంక్రాంతి పండుగ ఎప్పుడు అనే కన్ఫ్యూజన్ తో పందెం రాయుళ్లు తలలు పట్టుకుంటున్నారు. కోడి పందాలు వేసేందుకు తిథి, నక్షత్రం, ఘడియలు చూసుకునే పందెం రాయుళ్లకు జ్యోతిష్యలు షాక్ ఇచ్చారు. పండుగ ఒకరోజు అటు ఇటు కావడంతో పందెం రాయుళ్లు అయోమయంలో పడ్డారు. ఏ రోజు భోగి, సంక్రాంతి పండుగలు వస్తాయో తెలియక మదనపడుతున్నారు. ఇప్పటికే సిద్ధంగా చేసుకున్న కోడి పుంజులతో ఏ రోజు బరిలో దిగాలన్నది స్పష్టత రాకపోవడంతో దిగాలు పడుతున్నారు. అసలు ఈ గందరగోళ పరిస్థితికి కారణమేంటి..? ఎందుకు పందెం రాయుళ్లు ఆందోళనకు గురవుతున్నారు..?

Advertisement

సంక్రాంతి పండుగ తేదీలపై నెలకొన్న గందరగోళం.. కోడిపందాల పెంపకందారులకు ఒక అసాధారణ సమస్యను సృష్టించింది. జ్యోతిష్య, సంఖ్యాశాస్త్రం ప్రకారం తేదీలలో వచ్చిన మార్పుకు అనుగుణంగా వారు కోళ్లను మార్చుకోవాల్సి వస్తుంది. సాధారణంగా.. లీపు సంవత్సరం మినహా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను జనవరి 13, 14, 15 తేదీల్లోనే జరుపుకుంటారు. అయితే.. ఈ సంవత్సరం లీపు సంవత్సరం కానప్పటికీ, పండితులు పండుగ తేదీలను లీపు సంవత్సరంలా జనవరి 14, 15, 16 తేదీలుగా లెక్కించారు. తేదీల మార్పు ఇటీవల వెల్లడి కావడంతో.. పండుగ కోసం చాలా ముందుగానే సన్నాహాలు ప్రారంభించే కోడిపందాల పెంపకం దారులు గందరగోళంలో పడ్డారు. ఎందుకంటే కోడి పుంజు ఈకలు నిర్దిష్ట రంగుల కలయికలు ఉన్న కొన్ని రకాల కోళ్లు పందెంలో విజయం సాధిస్తాయని నమ్ముతారు పందెం రాయుళ్లు.

మొన్నటివరకు పందెం రాయుళ్లు జనవరి 13, 14, 15 తేదీలను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్దిష్ట రకం రంగు కోళ్లను పెంచారు. అయితే ఇప్పుడు జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం జనవరి 14, 15, 16 తేదీలకు సరిపోయే కోళ్లను మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు

Advertisement

పందెం కాసేవారికి అనేక మూఢనమ్మకాలు ఉన్నాయంటున్నారు పందెం రాయుళ్లు. సమయం, రోజు, నక్షత్రం, చంద్రుడు, సూర్య రాశి చిహ్నాల ఆధారంగా నిర్దిష్ట రంగుల కోళ్లపై పందెం కాస్తారు పందెం రాయుళ్లు. సంక్రాంతి తేదీల మార్పుపై గందరగోళం కారణంగా కొన్ని కోళ్లకు అధిక గిరాకీ ఏర్పడింది. ఒక్క రోజుతో తేదీలు మారడంతో సంక్రాంతి చివరి రోజైన కనుమ పండుగ శుక్రవారం రానుంది. శుక్రవారానికి అనువైనవిగా భావించే కోడి నెమలి, డేగ, పచ్చ కాకి, కోడి పింగళ, నెమలి అబ్రాసు వంటి ప్రత్యేక రకాల కోడిపుంజుల కోసం గిరాకీ ఏర్పడింది.

Also Read: కనిపించని దారి.. ఆగని మంచు.. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై ప్రమాదకర పరిస్థితులు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాలి కాటా తోనే పందానికి సై అంటున్నారు పందెం రాయుళ్లు. కోడి కాలికి కత్తి కట్టకుండా ఉన్నటువంటి గోరుతోనే పందాలు నిర్వహిస్తారు. అయితే.. ఇవి ఎక్కువసేపు ఉంటాయని అందుకే కనుమరుగు అయిపోతున్నాయని చెప్తున్నారు పందెం రాయుళ్ళు. కోడి కాళ్లకు సహజంగా పెరిగిన కాటానే షేప్ చేస్తూ పందానికి దిగే సమయానికి దాన్ని కత్తిలా తయారుచేస్తారు.

Related News

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×