E-Paper
Advertisement

Bharathiraja: ఐసీయూలో స్టార్ డైరెక్టర్.. మొన్న కొడుకు మరణం.. నేడు..

Bharathiraja: ఐసీయూలో స్టార్ డైరెక్టర్.. మొన్న కొడుకు మరణం.. నేడు..
Advertisement

Bharathiraja:ప్రముఖ కోలీవుడ్ నటుడు, స్టార్ డైరెక్టర్ తాజాగా హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.అసలు ఆయనకు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో పలు రకాల ప్రశ్నలతో చర్చ మొదలుపెట్టారు. అసలు విషయంలోకి వెళ్తే.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడం వల్లే భారతీరాజా ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

హాస్పిటల్లో చేరిన భారతీరాజా..

భారతీరాజా ప్రస్తుత వయసు 84 సంవత్సరాలు. గత ఏడాది సంక్రాంతి సమయంలో కూడా చురుకుగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు మనోజ్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో భారతీరాజా తీవ్రంగా కృంగిపోయారు.కొడుకు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక మానసిక వేదన అనుభవిస్తున్నారు. పైగా వయసు మీద పడడంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కొడుకు మరణం తర్వాత మలేషియా వెళ్ళిపోయిన ఈయన.. అక్కడే తన కుమార్తె ఇంట్లో నివసించేవారు. అయితే ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చారు. డిసెంబర్ చివరిలో ఆయనకు అనారోగ్యం చేసింది. దాంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఇక నిరంతరం చికిత్స అందిస్తున్న సమయంలోనే భారతీరాజా ఆరోగ్యం పై ఇలాంటి వదంతులు వ్యాపించడం మొదలైంది

స్పందించిన కుటుంబ సభ్యులు..

Advertisement

ముఖ్యంగా కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో భారతీరాజాను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కుటుంబ సభ్యుల ద్వారానే తెలియజేస్తామని, కాబట్టి ఆయన ఆరోగ్యం పై వచ్చే ఎలాంటి వదంతులను ఎవరు నమ్మకండి అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తానికైతే భారతీరాజా ఆరోగ్య విషయంపై వస్తున్న వదంతులకు కుటుంబ సభ్యులు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక త్వరలోనే ఆయన కోలుకొని వస్తారు అని కూడా క్లారిటీ ఇచ్చారు. అటు ఈ విషయంపై హాస్పిటల్ బృందం హెల్త్ బులెటిన్ ను కూడా విడుదల చేసింది. వైద్యులు నిశితంగా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని చికిత్సకు భారతీరాజా కూడా సహకరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:Thalaivar 173: ఎట్టకేలకు దొరికేసిన డైరెక్టర్..ఫలితం సంగతేంటి?

భారతీరాజా సినిమా కెరియర్:

Advertisement

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈయన ఎక్కువగా సహజ సిద్ధమైన ప్రదేశాలలో షూటింగ్ చేస్తూ తన సినిమాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చారు. కోలీవుడ్ దర్శకుడు అయినప్పటికీ తెలుగులో సినిమాలు చేసి నేషనల్ అవార్డులు కూడా అందుకున్నారు. అలా ఈయన దర్శకత్వం వహించిన తెలుగు తొలి చిత్రం సీతాకోకచిలుక.. ఉత్తమ చిత్రంగా భారత చలనచిత్ర పురస్కారంతోపాటు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా లభించింది..ఆ తర్వాత మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను అందించగా.. పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈయన దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల విషయానికొస్తే.. ఎర్రగులాబీలు, టిక్ టిక్ టిక్ జమదగ్ని, ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×