E-Paper
Advertisement

Deepika Padukone: అయ్యో దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది

Deepika Padukone: అయ్యో దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది
Advertisement

Deepika Padukone in AA22xA6: బాలీవుడ్బ్యూటీ క్వీన్దీపికా పదుకొనె ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. బాలీవుడ్లో హీరోలకు సమామైన గుర్తింపు. డ్యాన్స్‌, యాక్షన్లో హీరోలకు పోటీపోటీగా గట్టి పోటీ ఇస్తుంది. కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్స్టార్హీరోయిన్గా రాణిస్తోంది. ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు. కానీ, ఇప్పటి వరకు హిందీలో ఆమెను రీప్లేస్చేసిన వారే లేరు. దశాబ్ధాలుగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. తనకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకుంది. హిందీలో మగుటం లేని మహారాణిలా రాణించిన ఆమె.. తెలుగులోనూ రాణించాలని చూసింది.

అమ్మ పాత్రలో ఒదిగిపోయిన దీపికా

Advertisement

అందుకే ఇక్కడ భారీ చిత్రంతో కెరీర్ని ప్లాన్చేసుకుంది. అప్పుడే కల్కి 2898 ఏడీ ఆఫర్రావడంతో ఒకే చెప్పి టాలీవుడ్లోకి గ్రాండ్ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో మంచి మార్కెట్సంపాదించుకోవాలన్న దీపికాకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. రెండో సినిమాకే  జరగాల్సిన డ్యామేజ్జరిగిపోయింది. స్పిరిట్‌, కల్కి 2 నుంచి ఆమె తొలగించడంతో ప్రస్తుతం తెలుగులో దీపికా కెరీర్ప్రశ్నార్థకంగా మారిందినిజానికి కల్కి 2898 ఏడీలో దీపికా తనదైన నటనతో తెలుగు ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఇందులో అమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. కీలక సన్నివేశాల్లో ఆమె పలకించిన హావభావాలు, ఎమోషన్స్ఆడియన్స్ని హత్తుకున్నాయి. తెలుగు ఆడియన్స్‌ దీపికాను ఆప్ట్‌ చేసుకుంటారా? అని ప్రశ్నించిన వారికి తనదైన నటనతో సమాధానం ఇచ్చింది. దీంతో తెలుగులో ఆమెకు తిరుగులేదని అనుకున్నారు అంతా. ఇక దీపికా సైతం తన క్రేజ్ ఇక్కడ మంచిమార్కెట్చేసుకోవాలని చూసింది.

స్పిరిట్, కల్కి నుంచి అవుట్

కానీ, అదే ఆమెను భారీగా దెబ్బ తిసిందనిపిస్తోంది.  టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి సైన్ చేసి కెరీర్ పరంగా దూసుకుపోవాలని చూసింది. కానీ, వాటికి స్పిరిట్తో బ్రేక్పడింది. కల్కిలో దీపికా నటనకు ఫిదా అయిన సందీప్రెడ్డి వంగా.. ప్రభాస్తో తను చేసే స్పిరిట్మూవీకి ఆమెనే హీరోయిన్అనుకున్నారు. అదే ఆమెను కలిసి చెప్పారు. స్పిరిట్కథ కూడా వినిపించాడు. కానీ, దీనికి ఆమె పెట్టిన కండిషన్స్చూసి దర్శకనిర్మాతలు కంగుతిన్నారు. హీరోకి సమామైన రెమ్యునరేషన్లేదా వచ్చిన లాభాల్లో షేర్స్అడిగిందట. ఇక వర్కింగ్ అవర్స్లోనూ లిమిట్స్పెట్టింది. వారానికి 8 నుంచి 12 గంటలు మాత్రమే పని చేస్తానంటూ నిబంధలు పెట్టడంతో.. స్పిరిటీ టీం ఆమెకు దండం పెట్టింది. దీపికాను వద్దని.. యానిమల్బ్యూటీ త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు సందీప్రెడ్డి వంగా.

Advertisement

Also Read: Deepika Padukone: శభాష్ తెలుగు ప్రొడ్యూసర్స్.. దీపికా ఇష్యూపై నెటిజన్స్ మాటలు ఇవి

ఇక ఆ ఒక్కడే సపోర్టు

విషయం బయటకు రావడంతో దీపికాకు నెగిటివిటీ పెరిగింది. తాజాగా కల్కి 2 నుంచి ఆమెను తొలగించడంతో.. నెగిటివిటీ మరింత ఎక్కువైంది. మూవీలో కీలక పాత్ర పోషించిన నటీనటులను వదులకునేందుకు మూవీ టీం ఎంతో ధైర్యం చేయాలని. ఎంతో పెద్ద కారణం ఉంటే కానీ, తొలగించారు. అలాంటి కఠినం నిర్ణయం కల్కి మూవీ టీం తీసుకుందంటే.. దీపికా స్థాయిలో వారిని ఇబ్బంది పెట్టి ఉంటుందో అర్థమైపోతుంది. ఆమెను తీసేయడానికి ఖచ్చితమైన కారణం మాత్రం మూవీ టీం వెల్లడించలేదు. కానీ, దీపికా తొలగించడం వెనక బలమైన కారణమే ఉంటుంది తెలుగు ఆడియన్స్అంత నమ్ముతున్నారు. దీంతో తెలుగులో తన మార్కెట్పెంచుకోవాలనుకున్న దీపికా.. మాత్రం ఇది పెద్ద షాక్‌. తెలుగులో ఆమె కెరీర్కి భారీ డ్యామేజ్జరిగిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఆమెకు ఒకే ఒక్క సపోర్టు ఉంది. అది అల్లు అర్జున్‌-అట్లీ మూవీ. సినిమా ఆమె డ్యామేజ్తిరిగి నిలబెడుతున్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే హీరో తెలుగు వాడే అయినా.. డైరెక్టర్‌, నిర్మాత తమిళ్ఇండస్ట్రీకి చెందిన వారు. కాబట్టి.. ఇక తెలుగులో దీపికా పని అయిపోయినట్టే అంటున్నారు సినీ క్రిటిక్స్, విశ్లేషకులు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×