Why Deepika Removed From Telugu Movies: కొన్ని రోజుల క్రితం స్పిరిట్ అనే మూవీ నుంచి దీపికా పదుకోణెను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా కల్కి 2 మూవీ నుంచి దీపికను తప్పిస్తున్నట్టు కాసేపటి క్రితం నిర్మాతలు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతలను శభాష్ అంటూ ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఒక హీరోయిన్‌ను సినిమాలో నుంచి అర్దాంతరంగా తీసేస్తే పాపం అనాలి కానీ, ఇలా ఎందుకు అంటున్నారు అని ఆలోచిస్తున్నారా… అయితే రండి ఆ కథ ఏంటో చూద్దాం…
అసలు కథలోకి వెళ్లే ముందు స్పిరిట్ మూవీ విషయంలో ఏం జరిగిందో చూద్దాం. ముందుగా స్పీరిట్ మూవీలో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా ఈమెను తీసుకున్నారు. కానీ, ఆమె డిమాండ్స్.. హై రెమ్యునరేషన్… డే లో 8 గంటలు మాత్రమే పని. ఆదివారం సెలవు… ఇలా కొన్ని సాధ్యం కాని డిమాండ్స్ చెప్పడంతో పాటు నమ్మకంగా హీరోయిన్‌కు స్టోరీ చెబితే అది బయట లీక్ చేయడం లాంటివి చేసిందని డైరెక్టర్ కం నిర్మాత అయిన సందీప్ రెడ్డి వంగా సినిమా నుంచి తీసేయడమే కాకుండా… ‘మూజే జర భి ఫరక్ నయ్ పడ్తా’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ఇష్యూను ఇంకా మర్చిపోనే లేదు.. అప్పుడే కల్కి నిర్మాతలు కల్కి 2 మూవీ నుంచి కూడా దీపికాను తప్పిస్తూ ట్వీట్ చేశారు. ఇక్కడ కారణం ఏంటో చెప్పకపోయినా… అందరూ అనుకునేది మాత్రం ఆమె గొంతెమ్మ కోరికలే. ఒక సినిమా కోసం ప్రాణం పెట్టాలే కానీ, ఆ సినిమా ప్రాణం తీసేలా చేయొద్దు అనేది మినిమం ఒక నటుడు లేదా నటికి ఉండాల్సిన క్వాలిటి.
కానీ, ఇక్కడ ఆమెకు అది లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా… సినిమాకు గౌరవం ఇచ్చినప్పుడే వాళ్లు స్టార్స్ అవుతారు. అలా కాకుండా తమ క్రేజ్ని ఉపయోగించి పొగరు చూపిస్తే ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ నెటింట పోస్టులు పెడుతున్నారు. అంతే కాదు… అప్పుడు స్పిరిట్, ఇప్పుడు కల్కిని నిర్మించేది తెలుగు నిర్మాతలే. వాళ్లు కంటెంట్, సినిమానే నమ్మారు కానీ, అందులో ఉండే స్టార్ కాస్ట్ ను కాదు. అందుకే సినిమాను దెబ్బేతీసేలా ఉంటే ఎంత పెద్ద స్టార్స్ అయినా.. దాని తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చినా… వెనకడుగు వేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
Also Read: OG Trailer: సర్ప్రైజ్.. ఓజీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!
ఇదే విషయాన్ని నెటజన్లు ప్రస్తావిస్తూ శభాష్ తెలుగు నిర్మాతలు అంటున్నారు. నిజానికి బాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితులు పెద్దగా కనిపించవు. హీరో కోసమో… హీరో కొడుకు, కూతురు కోసమో సినిమాలు చేస్తారు నిర్మాతలు అక్కడ. అంతే కాదు.. హీరోయిన్ కోసం కూడా క్యారెక్టర్లను క్రియేట్ చేస్తారు. హీరో, హీరోయిన్లు లేకుంటే సినిమా లేదు అన్నట్టు అక్కడ కొంత మంది ఉంటారు. కానీ, తెలుగులో మాత్రం హీరో కాదు.. హీరోయిన్ కాదు.. సినిమా ఇంపార్టెంట్ అని ఈ ఇద్దరు నిర్మాతలు ప్రూవ్ చేశారు అంటూ సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.