Mystery Banyan Tree: మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలిసినా, మరికొన్ని అద్భుతాలు మనకు తెలియకుండా గడిచిపోతుంటాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి చెట్లు. సాధారణంగా ఒక చెట్టు వంద, రెండువందల ఏళ్లు బతికితే ఆశ్చర్యపోతాం. కానీ ప్రకృతిలో కొన్ని చెట్లు వేల సంవత్సరాల పాటు కూడా సజీవంగానే ఉంటాయి. అలసటగా ఉన్నప్పుడు చెట్టు కనిపిస్తే కాసేపు దాని కింత కూర్చొని అలసట తీర్చుకుంటాం ఇది మనందరికీ తెలిసిందే. కానీ చెట్టు కింద కూర్చొంటే మన గతం కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది అలాంటి చెట్టు గురించే. మరి ఆ చెట్టు ఎక్కడ ఉంది? గతం నిజంగా కనిపిస్తుందా? తెలుసుకుందాం.
డొడ్డ ఆలద మర.. గతాన్ని చూపించే చెట్టు
బెంగళూరు నగరం నుంచి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో, కేతోహళ్లి గ్రామంలో ఉన్న డొడ్డ ఆలద మర (Dodda Alada Mara) అనే భారీ చెట్టు ఉంది. ఇది వేల శతాబ్దాల వయసు కలిగి ఉంది. అంతేకాదు ఈ చెట్టు సుమారు 3 హెక్టర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. దాని వేరు, కొమ్మలు అంతలా విస్తరించి ఉండటంతో ఇది ఒక చిన్న అడవిలా కనిపిస్తుంది. ఇదంతా బాగానే ఉన్నా, దీని కింద కూర్చుని కాసేపు కళ్లు మూసుకుంటే, మన గతం కనిపిస్తుందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అందేకే స్థానికులు దీన్ని “గతాన్ని చూపించే చెట్టు” అని పిలుస్తారు. చెట్టు కింద కూర్చుంటే గతంలో జరిగిన సంఘటనలు కళ్లముందు ప్రత్యక్షంగా కనబడతాయని వారు నమ్ముతారు.
శాస్త్రాలు ఏమంటున్నాయి?
కేతోహళ్లి గ్రామంలోని డొడ్డ ఆలద మర కింద కూర్చుంటే జ్ఞాపకాలు కనిపిస్తాయని చెప్పుకునే ఆ విశ్వాసం శాస్త్రీయంగా రుజువు కాలేదు. కొంతమంది పరిశోధకులు చెట్టు నుంచి వచ్చే వాసనలు మానసిక ప్రభావం కలిగిస్తాయేమో అని అనుకుంటారు. మరికొందరు ఇది మనోవైజ్ఞానిక ప్రభావమే అని చెబుతున్నారు. కానీ గ్రామస్తులకు మాత్రం ఇది ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరంలా భావిస్తారు.
Also Read: Airtel Xstream Fiber: ఒక్క ప్లాన్‌తో మూడు సేవలు.. ప్రతి నెల రూ.250 వరకు ఆదా
ప్రతి ఒక్కరికీ కాకపోవడం మరో రహస్యం
ఆశ్చర్యకరంగా, ప్రతి ఒక్కరికీ ఈ అనుభవం రాదు. కొంత మందికే జ్ఞాపకాల రూపంలో అనుభూతి కలుగుతుంది. దీంతో చెట్టు తనకు నచ్చిన వారికే గతాన్ని చూపిస్తుందేమో అన్న నమ్మకం ఏర్పడింది. కానీ అక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం, ఇక్కడకు చాలా మంది సందర్శకులు వస్తుంటారని, కొందరికి అనుభవం కలిగితే మరి కొందరికి ఆ అనుభవం కలగలేదని తెలిపారు. కొందరు సందర్శకులు అయితే వారికి గతం కనిపించిందని అంటుంటే మరికొంత మంది అలాంటి అనుభవం చూడలేదని అంటున్నారు.
భారతదేశపు ప్రాచీన వటవృక్షాలు
మన దేశంలో రామేశ్వరం దగ్గర ఉన్న పంచవటి వటవృక్షం, ఆంధ్రప్రదేశ్‌లోని తిమ్మమ్మ మారిమన చెట్టు వంటి వటవృక్షాలు వందల ఏళ్లుగా మనుషుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా తిమ్మమ్మ మారిమన చెట్టు తన విస్తీర్ణం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద వటవృక్షాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇలాంటివి కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అమెరికాలోని మెథుసెలా పైన్ చెట్టు 4,800 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ చెట్లు కూడా వేల సంవత్సరాలు జీవిస్తాయి.
చెట్లు ఇంతకాలం ఎలా జీవిస్తాయి?
శాస్త్రవేత్తల ప్రకారం పెద్ద చెట్లకు అనుకూల వాతావరణం, లోతైన వేర్లు, సెల్ పునరుత్పత్తి శక్తి బలంగా ఉండటం వల్ల వీటి జీవనకాలం సాధారణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. మనుషుల కంటే వీటి మెటబాలిజం చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. అందువల్ల వృద్ధాప్యం త్వరగా రావడం లేదు.
మనుషుల కంటే ఎక్కువ చరిత్ర మోసే చెట్లు
ప్రకృతిలోని చెట్లు కేవలం నీడ, ఆహారం, ఆక్సిజన్ ఇచ్చేవి మాత్రమే కాదు. కొన్నిసార్లు అవి మనకు రహస్యాలను, విశ్వాసాలను, అనుభూతులను కూడా ఇస్తాయి. వేల సంవత్సరాలుగా జీవిస్తూ ప్రకృతి లోకంలో శాశ్వతంగా నిలిచిపోయే చెట్లు నిజంగానే మనుషుల కంటే ఎక్కువ చరిత్రను మోస్తూ ఉంటాయి. అందుకే చెట్లను కాపాడటం అంటే, వేల సంవత్సరాల చరిత్రను, అనుభూతిని, భవిష్యత్తు శ్వాసను కాపాడటమే.