Allu Arjun:ఇది సినిమా ఇండస్ట్రీ ..ఇక్కడ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి ఒకరు చేసే సినిమా మరొక చేతిలోకి వెళ్లడం ఇక్కడ చాలా కామన్ అంతేకాదు ఇక్కడ హీరోగా సినిమాలని మొదలెట్టి ఆ తర్వాత మార్చేసిన సందర్భాలు ఉన్నాయి .
అయితే అదిగో అలా సినిమాని మొదలెట్టి సినిమాకి హీరోని కమిట్ చేసి మరి ఆ హీరోని మార్చేసిన ఒక క్రేజీ ఇన్సిడెంట్ గురించిన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వవైరల్ అవుతుంది.ఆ విషయం చెప్పింది ఎవరో కాదు సీనియర్ రైటర్ చిన్నికృష్ణ.ఇంతకీ ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం.
అల్లు అర్జున్ కెరీర్ మొదలైన సినిమా గంగోత్రి కాదు
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్న అల్లు అర్జున్ కెరీర్ మొదలైన సినిమా గంగోత్రి కాదట,2002లో విడుదలై సూపర్ హిట్ అయిన జయం సినిమా నే బన్నీ మొదటి సినిమా కావాల్సిందట .ఇక దర్శకుడు తేజ కూడా మొదట అల్లుఅర్జున్ నే ఫైనల్ చేశాడని చెప్పుకొచ్చాడు చిన్ని కృష్ణ .
అయితే అప్పటికే అల్లు అర్జున్ ఇంకా హీరోగా పరిచయం కాలేదు.దీంతో మెగా ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వస్తున్నాడు అనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక మరోవైపు తేజ కూడా కొత్త వాళ్ళతో సినిమాలు చేసి హిట్స్ కొట్టే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.అందుకే బన్నీతో తేజ సినిమా చేస్తున్నాడని టాక్ బయటికి రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో క్యూరియాసిటీ పెరిగింది .ఇక హీరో ఫైనల్ అయినా తర్వాత యూనిట్ కి ప్రత్యేకంగా పార్టీ కూడా ఏర్పాటు చేశారట.ఆ పార్టీలో తాను కూడా పాల్గొన్నాను అని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నాడు ఈ సీనియర్ రైటర్.
ఊహించని సంఘటన
ఇక త్వరలోనే సినిమా షూటింగ్ కూడా జరగబోతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఊహించని సంఘటన జరిగిందట. రెండు మూడు రోజుల తర్వాత పేపర్ చూస్తే హీరోగా అల్లు అర్జున్ పేరు కనిపించలేదని దాని అదే ప్లేస్ లో కొత్త కుర్రాడు నితిన్ పేరు ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపాడు.
అసలు తేజ బన్నీని కాదని నితిన్ ని ఎందుకు పెట్టుకున్నాడో తనకి ఇప్పటికీ తెలియదని చెప్పుకొచ్చాడు చిన్ని. ఇక తేజ కూడా ఎలాంటి కారణం చెప్పలేదని తెలిపాడు.
Also read :ప్రభాస్ శ్రీను జీవితాన్ని మార్చేసిన శరత్ బాబు.. అసలు కథ ఇదే!
అయితే మొత్తానికి జయం సినిమాలో నితిన్ కాకుండా బన్నీ నటించాల్సి ఉండేదని చిన్నికృష్ణ మాటలు అర్థం అయిపోయింది.ఇక ప్రత్యేకంగా అల్లు అర్జున్ లాంచింగ్ కోసం కథ రాయాల్సిన బాధ్యత తన మీద పడిందని తెలిపాడు .ఇక అప్పటికే రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాకు కథ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తనకు రజిని మరోసారి అవకాశం ఇచ్చినప్పటికీ బన్నీని హీరోగా లాంచ్ చేయాలని ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టినట్టు చెప్పుకొచ్చాడు .
అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే
అలా కే రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ తో కలిసి ఎన్నో చర్చల తర్వాత గంగోత్రి కాదని సిద్ధం చేశానని తెలిపాడు.ఇక అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే 2003 మే 8న విడుదలైన గంగోత్రి ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో చెప్పక్కర్లేదు.
ఇక ఆ తర్వాత ఏడాది వచ్చిన ఆర్యతో ఒక్కసారిగా ఇండస్ట్రీ అటెన్షన్ ని తనవైపు తిప్పుకున్నాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా బన్నీ, దేశముదురు, పరుగు , జులాయి, రేసుగుర్రం అలవైకుంఠపురంలో, పుష్ప2… ఇలా ఎన్నో తన ఖాతాలో వేసుకుని ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే .
ఇక జయం సినిమా విషయానికొస్తే హీరోగా చేసిన నితిన్ కి ఆ సినిమా లైఫ్ ఇచ్చిందని చెప్పాలి .2002 జూన్ 14న రిలీజ్ అయిన ఆ సినిమా అప్పట్లో ఒక సంచలనం.ఇక వెళ్ళవయ్యా వెళ్లూ అంటూ సదా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఎవర్ గ్రీన్.
Also read :కాజల్ కారవాన్‌లో జరిగిన ఘటన.. ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరోయిన్!
ఎన్ని అడుగుల ముందున్నాడో
ఆ సినిమాతోనే నితిన్ వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ గా ఎదిగిపోయాడు .అయితే అలా సినిమాని మిస్ చేసుకున్న బన్నీ ఇప్పుడు నితిన్ కన్నా ఎన్ని అడుగుల ముందున్నాడో స్పెషల్ గా చెప్పక్కర్లేదు ఏదేమైనా ఇండస్ట్రీలో ఒక చిన్న నిర్ణయం ఎంత పెద్ద మార్పులు తీసుకొస్తాయో ఇలాంటి ఇన్సిడెంట్లే ప్రూవ్ చేస్తుంటాయి!