E-Paper
Advertisement

ప్రభాస్ శ్రీను జీవితాన్ని మార్చేసిన శరత్ బాబు.. అసలు కథ ఇదే!

ప్రభాస్ శ్రీను జీవితాన్ని మార్చేసిన శరత్ బాబు.. అసలు కథ ఇదే!
Advertisement

Prabhas Srinu:ప్రభాస్ శ్రీను.. తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం, అలీ ,సునీల్ తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పూయించిన కమెడియన్ .ఇక ఈయన పేరులో ఉన్న ప్రభాస్ ని చూసిన చాలా మంది అసలు ప్రభాస్ కి ఈయన ఏమవుతారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి.అయితే తాజాగా వాటన్నిటికీ ఇదిగో ఒక ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పుకొచ్చాడు ప్రభాస్ శ్రీను .చదువు ఎందుకు మధ్యలో ఆగిపోయింది, తన తండ్రి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలను చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు

పేరు వెనకాలున్న సీక్రెట్ రివీల్

Advertisement

ప్రభాస్ తనకి దగ్గరి రిలేటివ్ ఏమీ కాదని ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చదివే రోజుల నుంచే ప్రభాస్ తో స్నేహం ఉండేదని,అలా సినిమాల్లోకి వచ్చాక కూడా  ప్రభాస్ కి దగ్గరవడం, ప్రభాస్ సినిమా డేట్స్ ,షూటింగ్ వ్యవహారాల వంటి వాటితో పాటు వ్యక్తిగత పనులు చేసేంత దగ్గర అయ్యానని తెలిపాడు .అప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది శ్రీనులు ఉండటంతో పాటు, ఆయనపై ఉన్న అభిమానంతో తన పేరు ముందు ప్రభాస్ ని పెట్టుకున్నానని పేరు వెనకాలున్న సీక్రెట్ రివీల్ చేశాడు.

Also read :క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ స్టార్‌గా.. ప్రగతి సెన్సేషన్!

Advertisement

ఇక ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితం మనం అస్సలు ప్లాన్ చేసినట్టు సాగదని,చాలా మంది పెళ్లి చేసుకోవాలని, సెటిల్ అవ్వాలని అనుకుంటారని కానీ దేవుడి ప్లాన్ వేరేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు.అదే సమయంలో ఒక సినిమాలో తనపై వచ్చిన ఫేమస్ డైలాగ్ ని గుర్తు చేసుకుంటూ ప్రతి అందమైన అమ్మాయికి ప్రభాస్ లాంటి భర్త కావాలని ఉంటుందని కానీ చివరికి ప్రభాస్ శ్రీను లాంటి వాళ్ళు దొరుకుతారు అని తన డైలాగ్ చెబుతూ సరదాగా నవ్వేశాడు ప్రభాస్ శ్రీను.

ఆ ఒక్క నిర్ణయం వల్లే తన జీవితం

ఇక అతను చిన్ననాటి విషయాలు చెబుతూ తనకు చదువు అస్సలు ఇష్టం ఉండేది కాదని పదో తరగతి తర్వాత ఏపీఆర్జేసీ ఎంట్రెన్స్ రాసి మంచి కాలేజీలో చేర్పించాలని నాన్న చాలా ప్రయత్నించాడని కానీ తన మనసంతా వేరే దారిలో ఉండేదని మనసులో మాటను బయట పెట్టాడు.ఇక స్నేహితులతో గొడవలు పడటం వంటి వాటి మీద దృష్టి పెట్టిన తను భవిష్యత్తు గురించి అసలు ఆలోచించలేదని తెలిపాడు .
అయితే తన కుటుంబానికి ప్రముఖ నటుడు శరత్ బాబు అత్యంత దగ్గర అని అతడు చెప్పిన సలహానే తన జీవితాన్ని మలుపు తెప్పిందని ఎమోషనల్ అయ్యాడు ప్రభాస్ శ్రీను వీడికి చదువు బలవంతంగా చెప్పినా ప్రయోజనం లేదు చెన్నై లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించండి నటన నేర్చుకుంటే భవిష్యత్తు ఉంటుంది అంటూ శరత్ బాబు చెప్పడంతో తన తండ్రి ఆ పని చేశాడని ఆ ఒక్క నిర్ణయం వల్లే తన జీవితం మారిపోయి ఇలా సినిమాల్లో ఉన్నానని శరత్ బాబు ని గుర్తు చేసుకున్నాడు.

Also read :మురుగదాస్, మణిరత్నం.. ఇప్పుడు రమేష్ వర్మ! ధ్రువ్ విక్రమ్ మళ్లీ సేమ్ సీన్ రిపీట్?

అయితే అందరూ కష్టాలు పడ్డట్టుగా తాను చెన్నైలో ఎలాంటి కష్టాలు పడలేదని, అసలు సినిమాల అవకాశాల కోసం తిరగలేదని క్లారిటీ ఇచ్చాడు.ఎంతోమంది తన గురించి రకరకాల కథలు చెబుతుంటారని అలాంటివి ఏమీ లేవని, కానీ వచ్చినా అవకాశాలని సద్వినియోగం చేసుకున్నానని తేల్చి చెప్పాడు.ఇక తనకి అప్పట్లో ఏ టార్గెట్ లేదని కేవలం కానీ తన తండ్రికి మాత్రం తనపై నమ్మకం ఉండేదని ఏదో ఒక రోజు గొప్పవాడు అవుతాడని నమ్మేవాడని తెలిపాడు.

గుర్తింపునిచ్చిన సినిమా మాత్రం గబ్బర్ సింగ్

ప్రభాస్ శ్రీను సినిమా కెరీర్ విషయానికి వస్తే బలుపు,ఆగడు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానంభవతి, వాల్తేరు వీరయ్య ,క్రాక్ ,రాజా ది గ్రేట్ ,వంటి ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించిన ఈయనకి గుర్తింపునిచ్చిన సినిమా మాత్రం గబ్బర్ సింగ్ అనే చెప్పాలి.

ఏది ఏమైనా తన మీద తనకే ఎలాంటి నమ్మకం లేకపోయినా జీవితంలో ఏదో ఒకటి సాధించవచ్చు అనడానికి ప్రభాస్ శ్రీను జీవితమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి

Related News

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ స్టార్‌గా.. ప్రగతి సెన్సేషన్!

కాజల్ కారవాన్‌లో జరిగిన ఘటన.. ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరోయిన్!

బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. ఇక కమ్‌బ్యాక్ కష్టమేనా..?

మురుగదాస్, మణిరత్నం.. ఇప్పుడు రమేష్ వర్మ! ధ్రువ్ విక్రమ్ మళ్లీ సేమ్ సీన్ రిపీట్?

‘చెన్నై లవ్ స్టోరీ’కి షాకింగ్ ట్విస్ట్.. OTT డీల్‌లో ఏం జరిగింది?

సంక్రాంతి రేస్ నుండి బాలయ్య అవుట్? NBK 111 రిలీజ్ వాయిదా వెనుక అసలు నిజం!

మంగళవారం సీక్వెల్ పై డైరెక్టర్ బిగ్ అప్డేట్.. ఈసారి అంతకుమించి అంటూ!

Big Stories

Advertisement
×