Samantha : సినీనటి సమంత ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినిమా రంగంలో నటిగా నిర్మాతగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో రకాల సరికొత్త బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా వ్యాపార రంగంలో కూడా సమంత(Samantha) మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే గత కొద్ది నెలల క్రితం ఈమె పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.సీక్రెట్ అల్కెమిస్ట్(secret alchemist) పేరుతో ఈ బ్రాండ్ ప్రారంభించారు.
ఇక సమంత మాత్రమే కాకుండా అంకిత తడాని, ఆకాష్ వాలి సంయుక్తంగా సీక్రెట్ అల్కెమిస్ట్ బ్రాండ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యుత్తమమైన పదార్థాలతో కెమికల్ ఫ్రీ ఫార్ములేషన్ తో తయారు చేసిన ఈ పెర్ఫ్యూమ్ కు భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఫర్ఫ్యూమ్ బ్రాండ్ అందుబాటులోకి తీసుకువచ్చి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది అయితే ఈ ఎనిమిది నెలలలో ఈ సంస్థ ఏకంగా 120 కోట్ల మైలురాయిని అధిగమించి లాభాలను సాధించింది.
ఇలా సమంత వ్యాపార రంగంలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్న నేపథ్యంలో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్ఫ్యూమ్ బ్రాండ్ మంచి సక్సెస్ కావడంతో బుధవారం ముంబైలో మరొక ఈవెంట్ ప్రారంభించారు. ఇందులో భాగంగా సిగ్నేచర్ కలెక్షన్ అంటూ మరొక బ్రాండ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సమంతకు కంగ్రాట్స్ తో పాటు ఇలాంటి మరెన్నో సక్సెస్ లు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక సమంత ఇటీవల మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ పెర్ఫ్యూమ్ బ్రాండ్ ద్వారా మరో 100 కోట్ల రూపాయల లాభాలను అందుకోవటం విశేషం. ప్రస్తుతం వ్యాపార రంగంలో దూకుడు కనబడుతున్న సమంత సినిమా ఇండస్ట్రీకి మాత్రం కొంత విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు. అతి త్వరలోనే సమంత తల్లిగా ప్రమోట్ కానున్నారు. ఈమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత గత ఏడాది డిసెంబర్ నెలలో డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత సమంత తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా సమంత నిత్యం తన బేబీ బంప్ (Baby Bump)ఫోటోలను షేర్ చేస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
Also Read: ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఇష్టపడే హీరో అతనేనా? అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ!