E-Paper
Advertisement

ప్యాన్ ఇండియా స్టార్ ప్లాన్ రివర్స్ అయితే? కల్కి, స్పిరిట్ మధ్య నలిగిపోతున్న ప్రభాస్!

ప్యాన్ ఇండియా స్టార్ ప్లాన్ రివర్స్ అయితే? కల్కి, స్పిరిట్ మధ్య నలిగిపోతున్న ప్రభాస్!
Advertisement

Prabhas Schedule: ప్రభాస్…ప్రభాస్…ప్రభాస్…ఇప్పుడు ఈ పేరే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్‌కు రెడీ అయిపోతున్నాడు మరి.అది కూడా గ్యాప్ లేకుండా..ఇక షెడ్యూల్స్ వరుస పెట్టి ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ ని చూసి మా రెబలోడి జోరు మాములుగా లేదుగా అంటూ మురిసిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్..లేటెస్ట్ గా ఈరోజు అంటే మే 4 నుంచి ‘కల్కి 2898 AD’ కోసం షార్ట్ షెడ్యూల్‌లో పాల్గొంటున్న ప్రభాస్, ఆ వెంటనే అంటే మే 10 నుంచి సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సెట్స్‌లోకి ఎంటర్ అవబోతున్నాడట. వినడానికి ఇది బాగానే ఉన్న ఈ స్పీడ్ వెనుక అసలు రీజన్ డెడికేషనా? లేక మార్కెట్ ప్రెజరా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

 రెండు పడవల పై  ప్రయాణం

Advertisement

మాములుగా బడా హీరోలంతా ఒక సినిమా కంప్లీట్ అయ్యాక ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి, కాస్త గ్యాప్ ఇచ్చి మరో సినిమాని మెదలెట్టేస్తారు.కానీ ప్రభాస్ మాత్రం కాస్తైనా రిలాక్స్ అవకుండా ఒకవైపు విజువల్ వండర్ ‘కల్కి’, మరోవైపు ఇంటెన్స్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ లో పాల్గొనడమే ట్రేడ్ వర్గాలకి షాక్ ఇస్తుంది.కారణం జానర్స్ పరంగా ఈ రెండు సినిమాలు వేర్వేరు కావడమే.

ALSO READ: వాళ్లు చేయలేనిది.. విజయ్ చేసి చూపించాడు

Advertisement

కల్కిలో ఫ్యూచరిస్టిక్ లుక్ లో కనిపిస్తుండగా స్పిరిట్‌లో మాత్రం  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో దర్శనమివ్వబోతున్నాడు. మరి ఇంత వేరియేషన్ ఉన్న రెండు సినిమాలు చేస్తున్న డార్లింగ్ జస్ట్ రోజుల గ్యాప్ లోనే రోల్స్ ని ఎక్స్చేంజ్ చేయడం అంటే అది ఒక యాక్టర్ పై మెంటల్ గా ప్రెజర్ పెట్టేదే.మరో వైపు ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వల్ల సినిమాల క్వాలిటీ దెబ్బతినే ఛాన్స్ కూడా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్

పాన్ ఇండియా రేసులో నంబర్ వన్

ఇక డార్లింగ్ గత కొంత కాలంగా పాన్ ఇండియా రేసులో నంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెల్సిందే.సో ఆ ప్లేస్ ని నిలబెట్టుకోవాలంటే కంటిన్యూస్‌గా థియేటర్లలో కనిపించడం చాల ముఖ్యం. ఇప్పటికే ‘సలార్’ తర్వాత చాలా గ్యాప్ వచ్చిందన్న టాక్ ఉంది .కాబట్టి ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ప్రభాస్ ఈ రిస్క్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.మరో వైపు సినిమా సినిమాకూ మధ్య గ్యాప్ ఎక్కువైతే ఆడియన్స్ మూడ్ మారుతుందనే భయంతోనే ఈ స్పీడ్ పెంచారా? అన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయ్.

ఇక ప్రభాస్ హెల్త్ అంతంత మాత్రమే అన్న టాక్ గత కొంతకాలంగా ప్రభాస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా.ఇలాంటి సమయంలో గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేయడం, భారీ యాక్షన్ సీక్వెన్సుల్లో పాల్గొనడం అతని హెల్త్ పై ప్రభావం చూపే అవకాశమే ఎక్కువ.దీనికి తోడు షార్ట్ షెడ్యూల్స్ వల్ల నిద్రలేకపోవడం, ప్రయాణాలు, మేకప్ లో చేంజెస్ చేయడం ఇవన్నీ కలిపి ప్రభాస్‌ను ఇబ్బంది పెట్టేవే.

క్వాలిటీని పక్కన పెడుతున్నారా?

మరో వైపు సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలనే తొందరలో క్వాలిటీని పక్కన పెడుతున్నారా? అనే టాక్ కూడా వినిపిస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలు చేసేటప్పుడు నటుడు ఆ పాత్రలో ఇమడాలంటే టైమ్ చాలా పడుతుంది.కానీ ఇప్పుడు ప్రభాస్ ప్లానింగ్ చూస్తుంటే అసలు సినిమాల కోసం తీసుకోవాల్సిన మినిమం కేర్ అయినా తీసుకుంటున్నారా అంటూ పెదవి విరుస్తున్నారు కొందరు నెటిజన్లు.

ఇక ‘డార్లింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ హ్యాష్ టాగ్స్ బాగానే ట్రెండ్ చేస్తున్నారు .కానీ, ట్రేడ్ వర్గాల్లో మాత్రం డార్లింగ్ ఇంతటి జెట్ స్పీడ్ లో తీసుకుపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఆందోళన కనిపిస్తుంది. చూడాలి మరి ఇంత హెవీ గా వర్క్ లోడ్ మీదేసుకుంటున్న ప్రభాస్ ఎలాంటి ఫలితాలు రాబడతాడో !

ALSO READ :సినిమా రీల్ నుంచి రియల్ పాలిటిక్స్ వరకు.. విజయ్-త్రిష అన్స్టాపబుల్ కెమిస్ట్రీ

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×