E-Paper
Advertisement

డైరెక్టర్లకు కొత్త రూల్ పెట్టిన పుష్ప రాజ్…ఇది సాధ్యమయ్యేపనేనా బన్నీ?

డైరెక్టర్లకు కొత్త రూల్ పెట్టిన పుష్ప రాజ్…ఇది సాధ్యమయ్యేపనేనా బన్నీ?
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాకా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు సమాచారం. తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇలా ఈ పోస్టర్ చూస్తుంటే అట్లీ భారీగానే ప్లాన్ చేస్తున్నారని స్పష్టమవుతుంది.

డైరెక్టర్లకు బన్నీ కండిషన్స్..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులను కూడా వరుసగా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తదుపరి సినిమాల విషయంలో అల్లు అర్జున్ దర్శకులకు ఒక కొత్త కండిషన్ పెట్టారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సుమారు రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది. ఇకపై అలా లేకుండా, వెంట వెంటనే సినిమాలను చేసే విధంగా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఒక్క సినిమాకు 200 రోజులే..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈయన నటించే సినిమాల విషయంలో డైరెక్టర్లకు సరికొత్త నిబంధనలను పెట్టారని తెలుస్తుంది. అల్లు అర్జున్ చేయబోయే ప్రతి ప్రాజెక్టు గరిష్టంగా 200 రోజులు మాత్రమే షూటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ 200 రోజులలో షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమాతో పాటు మరో సినిమా షూటింగ్ పనులను కూడా సమాంతరంగా కొనసాగించాలని ఈయన నిర్ణయం తీసుకోవడమే కాకుండా డైరెక్టర్లకు కూడా ఈ కండిషన్ పెట్టారని తెలుస్తోంది. ఇలా 200 రోజులు ఒక ప్రాజెక్టుకు కేటాయించటం వల్ల ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పాలి.

అక్టోబర్ నుంచి లోకేష్ డైరెక్షన్ లో బన్నీ..

Advertisement

ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేయబోయే ఈ సినిమా షూటింగ్ పనులు మరో 3 నెలలలో పూర్తి కానున్నాయి. అక్టోబర్ నుంచి అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేయబోయే సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన 2027లో బాసిల్ జోసెఫ్ డైరెక్షన్లో మరో సినిమాకు కూడా కమిట్ కానున్నారని తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ ఈ కొత్త నిబంధన ద్వారా తన అవుట్ పుట్ ను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ డైరెక్టర్లకు కొత్త కండిషన్ పెట్టారనే విషయం తెలియడంతో అభిమానులు ఇదొక మంచి నిర్ణయమే అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఇది ఆ సాధ్యమైన పని అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఎన్టీఆర్ సినిమాకు మోక్షం.. టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన పాన్ ఇండియా మూవీ?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×