E-Paper
Advertisement

ఎన్టీఆర్ సినిమాకు మోక్షం.. టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన పాన్ ఇండియా మూవీ?

ఎన్టీఆర్ సినిమాకు మోక్షం.. టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన పాన్ ఇండియా మూవీ?
Advertisement

War 2Film: ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లో విడుదలైన కొద్ది రోజుల వ్యవధిలోనే తిరిగి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఒక సినిమా థియేటర్ లో విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే టెలివిజన్ ప్రీమియర్ కూడా అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందే సాటిలైట్ హక్కులు అమ్ముడుపోవడంతో ఇలా సినిమాలను టీవీలలో కూడా ప్రసారం చేస్తూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు విడుదల అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు టెలివిజన్ ప్రీమియర్ కు దూరంగానే ఉన్నాయి . అలాంటి వాటిలో ఎన్టీఆర్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి.

అమ్ముడుపోని దేవర సాటిలైట్ రైట్స్..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్మడుపోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ సినిమా విషయం పక్కన పెట్టితే ఎన్టీఆర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వార్ 2. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో విడుదల అయింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయిందని చెప్పాలి.

స్టార్ మాలో వార్ 2..

Advertisement

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వార్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న విధంగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది. అయితే దాదాపు 8 నెలల తర్వాత ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ చానల్ స్టార్ మా కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు వర్షన్ కి సంబంధించి టెలివిజన్ ప్రీమియర్ కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. మే 3 వ తేదీ ఈ సినిమా స్టార్ మాలో ప్రసారం కానుంది.

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా..

Advertisement

ఇలా 8 నెలల తర్వాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది అయితే మే 21 తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read: ధనుష్ కర సినిమా సెన్సార్ పూర్తి… రన్ టైం ఎంతంటే?

Related News

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

Big Stories

Advertisement
×