E-Paper
Advertisement

Rashmika Marriage: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన రష్మిక.. పెళ్లి ఎప్పుడంటే?

Rashmika Marriage: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన రష్మిక.. పెళ్లి ఎప్పుడంటే?
Advertisement

Rashmika Marriage: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. 2025 సంవత్సరంలో ఈమె ఏకంగా 5 సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. చివరిగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పబోతున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో రష్మిక ఎంతో బిజీగా ఉన్న రష్మిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్న రష్మిక..

రష్మిక గత కొంతకాలంగా నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో రిలేషన్ లో ఉంటూ తనని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ అక్టోబర్ నెలలో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. అయితే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కానీ , వీరికి నిశ్చితార్థం గురించి కానీ విజయ్ దేవరకొండ రష్మిక ఎక్కడ అధికారకంగా స్పందించలేదు. అయినప్పటికీ వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. రష్మిక విజయ్ దేవరకొండ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.

సరైన సమయంలో అన్ని చెబుతా..

Advertisement

ఇక రష్మిక విజయ్ దేవరకొండ వివాహం ఫిబ్రవరి 26వ తేదీ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మికకు ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ.. నా పెళ్లి గురించి వస్తున్న ఈ రూమర్స్ ను తాను ఖండించలేనని తెలిపారు. ఇకపోతే నా పెళ్లి గురించి ఖచ్చితంగా సరైన సమయంలో అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటానని తెలిపారు. అభిమానులకు చెప్పిన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటానని ఈమె తెలియజేశారు కానీ పెళ్లి తేదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

2025 ఎంతో ప్రత్యేకం..

Advertisement

ఇకపోతే తనకు తన వ్యక్తిగత విషయాలను బయట చెప్పుకోవడానికి ఇష్టపడనని తెలిపారు. అలాగే ఇంట్లో సినిమాల గురించి మాట్లాడటానికి ఇష్టపడనని రష్మిక తెలియజేశారు . ఇక ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని, తాను నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడంతో 2025 తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పెళ్లి తేదీ గురించి రష్మిక ఎక్కడ ప్రస్తావించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు .కానీ ఈమె పెళ్లి తేదీని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పడంతో అభిమానులు మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదని తెలుస్తుంది . ఇక రష్మిక ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: Bunny Vas on Sri Tej : అప్పుడు సాయం అన్నారు… ఇప్పుడు సాకులు చెబుతున్నారు

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×