E-Paper
Advertisement

MSVPG Film: తెలంగాణలోనూ పెరిగిన మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు.. జీవో జారీ!

MSVPG Film: తెలంగాణలోనూ పెరిగిన మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు.. జీవో జారీ!
Advertisement

MSVPG Film: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సంక్రాంతి పండుగ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాగా 11వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. మరొక రోజులో శంకర్ వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు మరి కాసేపట్లో బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా టికెట్ ధరలను పెంచుతూ జీవోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్లకు 500 సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వంద రూపాయలు మల్టీప్లెక్స్ లలో రూ. 120 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో టికెట్ ధరలు పెరుగుతాయా? లేదా? అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా చిరంజీవి సినిమాకు గుడ్ న్యూస్ చెబుతూ సినిమా టికెట్ ధరలను పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇక తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే..

ప్రీమియర్ టికెట్ ధర రూ. 600

Advertisement

మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్లు 11వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలో ప్రసారం కానున్నాయి. ఈ ప్రీమియర్లకు 600 రూపాయలు చొప్పున టికెట్ ధరలను పెంచారు అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 100 రూపాయలను పెంచుతూ ఉత్తర్వులను జారీచేసింది. ఈ పెరిగిన ధరలు ఏడు రోజులపాటు అనగా 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలంగాణ సర్కార్ తెలియజేసింది. ఈ సినిమాకు తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెరగడంతో అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్..

Advertisement

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. అలాగే మరొక హీరోయిన్ కేథరిన్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. విక్టరీ వెంకటేష్ సైతం క్యామియో పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పై సాహుగారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. 2023లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చిరు నటించిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి మన శంకర్ వరప్రసాద్ గారుతో చిరంజీవి ఇలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: MSVPG Film: ఏపీలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ కు పెరిగిన టికెట్ రేట్లు ..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×