BigTV English

Big Breaking: అల్లు ఇంట విషాదం.. అల్లు అరవింద్ తల్లి కన్నుమూత!

Big Breaking: అల్లు ఇంట విషాదం.. అల్లు అరవింద్ తల్లి కన్నుమూత!
Advertisement

Big Breaking:తెలుగు చలనచిత్ర పరిశ్రమలు మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్లో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో ఒకటిగా పేరు సొంతం చేసుకున్న అల్లు కుటుంబంలో నేడు విషాదఛాయలు అలుముకున్నాయి. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ (Allu Aravindh) తల్లి , దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (Allu Kanaka Ratnamma) గారు కన్నుమూశారు. 94 సంవత్సరాల వయసులో వృద్ధాప్య కారణాల చేత ఆమె మరణించినట్లు సమాచారం. అర్థరాత్రి దాటాక అనగా 1:45 AM గంటల సమయంలో ఆమె తదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


ఇంటికి చేరుకుంటున్న స్టార్ సెలబ్రిటీలు..

ఈరోజు ఉదయం 9 గంటలకు ఆమె పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ గారి ఇంటికి తరలించనున్నారు. ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న రామ్ చరణ్ (Ram Charan) మైసూర్ నుంచి, అల్లు అర్జున్ (Allu Arjun) ముంబై నుంచి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు. అటు అల్లు అరవింద్, చిరంజీవి (Chiranjeevi) దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నాగబాబు (Nagababu) లు వైజాగ్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్లో ఉన్నందు వల్ల రేపు వచ్చి వారు అల్లు కుటుంబానికి సంతాపం తెలుపనున్నారు.


గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడ్డ కనకరత్నమ్మ..

ఇకపోతే వయోభారం కారణంగా గతంలో కూడా కనక రత్నమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ముఖ్యంగా వయోభారం కారణంగా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో.. ఇంట్లోనే ఫ్యామిలీ డాక్టర్ చేత ఆమెకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు కూడా వినిపించాయి. ఇక ఆమె కోలుకున్నారు.. అంతా ఓకే.. అనుకునే సమయంలో ఇప్పుడు ఆమె ఏకంగా స్వర్గస్తులవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

శోకసంద్రంలో అల్లు, మెగా కుటుంబాలు..

అల్లు రామలింగయ్య తర్వాత అల్లు కనకరత్నమ్మ అటు అల్లు, ఇటు మెగా కుటుంబాలకు పెద్దదిక్కుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అటు చిరంజీవి తల్లి గారు అంజనాదేవితో ఈమెకు మంచి సాన్నిహిత్యం ఉండేదట. ఇప్పుడు ఈమె మరణాన్ని అటు అల్లు కుటుంబ సభ్యులు ఇటు మెగా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఈ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె అంతక్రియలను నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.

ALSO READ: Actress Poorna: మరో గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ.. త్వరలో!

Related News

Nagarjuna 100: నాగార్జున ల్యాండ్ మార్క్ మూవీ.. రంగంలోకి స్వీటీ?

‎MSVPG: మన శంకర వరప్రసాద్ గారి కోసం మరో హీరోయిన్.. ఇలా లీక్ చేసారేంటీ?

‎Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో అతనేనా? తెలుగులో ఎవరు లేరా?

SKN: గొప్ప మనసు చాటుకున్న నిర్మాత ఎస్కేయన్.. అభిమాని కుటుంబానికి అండగా!

Raghu Dixit : 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటున్న సింగర్ రఘు , వధువు ఎవరో తెలుసా?

Vijaya Devarakonda: క్రేజీ కాంబో.. ఆ హిట్‌ డైరెక్టర్‌కి ఒకే చెప్పిన విజయ్‌..!

Radhika Apte: హీరోలను హైలెట్ చేయడానికే సినిమాలు… హీరోయిన్లు వాటికే పరిమితమా?

Dude Movie : డ్యూడ్ కోసం డైరెక్టర్ కన్నీటి కథ… జూబ్లీహిల్స్ రోడ్లమీద పడిగాపులు

Big Stories

×