Arshdeep Singh : టీమిండియా క్రికెటర్ అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టీమిండియా టీ-20 బౌలర్ గా మంచి రికార్డు ఉంది. ప్రస్తుతం ఆసియా కప్ కి కూడా ఎంపికయ్యాడు. అలాగే టెస్ట్ క్రికెట్ కి కూడా ఎంపికైనప్పటికీ.. ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల్లో ఇతనికి స్థానం దక్కలేదు. స్థానం ఇవ్వాలనుకున్న సమయంలో ఇతనికి గాయం కావడం గమనార్హం. దీంతో అర్ష్ దీప్ సింగ్ టెస్టుల్లో ఆరంగేట్రం చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. తాజాగా దులీప్ ట్రోఫీలో అర్ష్ దీప్ సింగ్ అద్భుతమే సృష్టించాడు. దులీప్ ట్రోఫీలో అర్ష్ దీప్ సింగ్ 2 బంతులు ఎదుర్కొని 2 బంతులను సిక్స్ లుగా మలిచాడు.
అర్ష్ దీప్ సింగ్ సిక్స్ లు..
దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి దులీప్ ట్రోఫీలో 11వ నెంబర్ గా వచ్చిన అర్ష్ దీప్ సింగ్ 600 స్ట్రైక్ రేట్ తో 2 వరుస సిక్స్ లను కొట్టడం విశేషం. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ నార్త్ 93. ఓవర్లలో 405 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక నార్త్ జోన్ బ్యాటింగ్ పరిశీలించినట్టయితే.. ఓపెనర్ శుభమ్ ఖజురియా 53 బంతుల్లో 26 పరుగులు చేశాడు. కెప్టెన్ అంకిత్ కుమార్ 42 బంతుల్లో 30 పరుగులు చేశాడు. యశ్ ధుల్ 67 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అయూష్ బదోనీ 60 బంతుల్లో 63 పరుగులు చేశాడు. నిశాంత్ సింధు 70 బంతుల్లో 47 పరుగులు చేశాడు. కన్హయ్య వర్దన్ 152 బంతుల్లో 76 పరుగులు చేశాడు. సాహిల్ లోత్రా 48 బంతుల్లో 19 పరుగులు చేశాడు. మయాంక్ డాగర్ 24 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అకిబ్ నబీ 33 బంతుల్లో 44 పరుగులు చేేశాడు. ఇక హర్షిత్ రాణా 11 బంతుల్లో 7 పరుగులు చేశాడు. మరోవైపు 11వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన అర్ష్ దీప్ సింగ్ వరుసగా 2 బంతుల్లో 2 సిక్స్ లు కొట్టి నాటౌట్ గా నిలిచాడు.
తడబడ్డ ఈస్ట్ జోన్..
ఇక ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ 1, సూరజ్ సింధు జైష్వాల్ 2, ముక్తర్ హుస్సెన్ 1, మానిషి 6 వికెట్లు తీసుకోవడం విశేషం. మానిషి దెబ్బకు 405 పరుగులకే ఆలౌట్ అయింది నార్త్ జోన్ టీమ్. ఇక ఈస్ట్ జోన్ బ్యాటింగ్ కి వచ్చి 230 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్ 49 బంతుల్లో 38 పరుగులు చేశాడు. శరణ్ దీప్ సింగ్ 8 బంతుల్లో 6 పరుగులు చేయగా.. శ్రీదమ్ పాల్ 17 బంతుల్లో 7, రియాన్ పరాగ్ 47 బంతుల్లో 39, విరాట్ సింగ్ 102 బంతుల్లో 69, కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్) 61 బంతుల్లో 29, సూరజ్ సింగ్ జైశ్వాల్ 34 బంతుల్లో 10 పరుగులు చేశాడు. మరోవైపు మానిషి, ముక్తర్ హుస్సెన్ డకౌట్ అయ్యారు. మహ్మద్ షమీ 1 ఔట్ కాగా.. ముఖేష్ కుమార్ 06 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో 56.1 ఓవర్లలో 230 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో నార్త్ జోన్ 175 పరుగుల ఆధిక్యం కనబరించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ అర్ష్ దీప్ సింగ్ వరుసగా రెండు సిక్సులు కొట్టడం హైలెట్ అనే చెప్పాలి.