Actress Poorna:ప్రముఖ హీరోయిన్ పూర్ణ (Poorna) తాజాగా అభిమానులతో మరో గుడ్ న్యూస్ పంచుకుంది. ఇప్పటికే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈమె.. త్వరలో మరో బిడ్డకు ఆహ్వానం పలుకుతున్నట్లు పోస్ట్ పెట్టింది. ఈ విషయం తెలిసి సెలబ్రిటీలు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు పూర్ణ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా..”నేను రెండోసారి తల్లి కాబోతున్నాను. ఈ విషయం చెప్పడానికి మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. పేరెంట్స్ అవడం జీవితంలో ఒక గొప్ప అదృష్టం. ఇప్పటికే దానిని మేము పొందాము. ఇప్పుడు రెండోసారి ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాము. మా సెకండ్ బేబీకి వెల్కమ్ చెబుతున్నాం” అంటూ రాసుకొచ్చింది పూర్ణ. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు క్షణాల్లో వైరల్ అవుతోంది. 2022లో దుబాయ్ కి చెందిన షానిద్ ఆసిఫ్ ఆలీ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
పూర్ణ కెరియర్..
హీరోయిన్ పూర్ణ.. ఈమె అసలు పేరు షామ్నా ఖాసిం.. భారతీయ సినీ నటిగా, మోడల్ గా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె శాస్త్రీయ నృత్య కళాకారిణిగా తన కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాత నటుడు, దర్శకుడు అయిన రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హార్రర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.
హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్ లలో కూడా..
ఇకపోతే రీఎంట్రీలో హీరోయిన్ గా కాకుండా స్పెషల్ సాంగ్ లలో నర్తిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగానే ‘గుంటూరుకారం’ సినిమాలో కుర్చీ మడతపెట్టి పాటతో తన అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది పూర్ణ. ఏది ఏమైనా పూర్ణ ఒకవైపు హీరోయిన్గా మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తూనే.. ఇంకొక వైపు వ్యక్తిగత జీవితంలో మాతృత్వపు మాధుర్య క్షణాలను ఆస్వాదిస్తూ కెరియర్ను కొనసాగిస్తోంది.
పూర్ణ పెళ్లి.. పిల్లలు
పూర్ణ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని 2022 అక్టోబర్ 25వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఈమెకు 2023లో కుమారుడు జన్మించారు.. ఇక ఈమె కొడుకుకి హమ్దాన్ అసిఫ్ అలీ అని నామకరణం కూడా చేశారు. ఇకపోతే రెండు మూడు రోజుల క్రితం తన భార్యకు దూరంగా ఉన్నానని.. ఒంటరితనం అనుభవించడం తన వల్ల కాలేదు అని.. 45 రోజులు నరకం చూసాను.. అంటూ ఆమె భర్త పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతలోనే ఈమె శుభవార్త చెబుతూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది.
ALSO READ:Bigg Boss 9: అయ్యో మళ్లీ కాటేశాడే.. ఉత్కంఠతో పాటు నవ్వులు కురిపించిన శ్రీముఖి!