E-Paper
Advertisement

Hyderabad: వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

Hyderabad: వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..
Advertisement

Hyderabad: రోజురోజుకు రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి. భర్తను, భార్య చంపుతుంది.. భార్యను, భర్త చంపుతున్నాడు. వివాహేతర సంబంధాలే ఎక్కువ హత్యలకు దారి తీస్తున్నాయి. అలాంటి ఘటనే సరూర్ నగర్‌ ఠాణాలో జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరామనగర్‌లో ఉంటున్న శేఖర్‌తో.. చిట్టికి16 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు (12), కూతురు (14) ఉన్నారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
అయితే నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన శేఖర్, రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టి కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. వారు సరూర్‌నగర్‌లోని కోదండరామ్‌నగర్ రోడ్డు నెంబర్ 7లో నివసిస్తున్నారు.

Advertisement

ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి భర్తను చంపిన భార్య
కొంతకాలంగా చిట్టికి అదే ప్రాంతంలో నివసించే హరీశ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. శేఖర్ తన డ్రైవర్ ఉద్యోగం కారణంగా తరచూ బయటికి వెళ్తుండటంతో ఈ సంబంధం మరింత బలపడింది. శేఖర్ ఈ విషయం తెలుసుకుని చిట్టిని పలుమార్లు మందలించాడు. ఇది వారి మధ్య గొడవలకు దారితీసింది. భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన చిట్టి, హరీశ్‌లు కలిసి అతడిని అంతం చేయాలని కుట్ర పన్నారు.

భర్త నిద్రిస్తున్న టైంలో గొంతు నులిమిన ప్రియుడు..
అయితే భర్త శేఖర్ నిద్రపోయిన తర్వాత చిట్టి తన కుమారుడిని పక్కన ఉన్న గణేశ్ మండపంలో నిద్రపోమని చెప్పి పంపించింది. ఆ తర్వాత హరీశ్‌ను ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి శేఖర్ గొంతు నులిమి, డంబెల్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఉదయం ఏమీ తెలియనట్లు నటించిన చిట్టి, భర్త నిద్రలోనే చనిపోయాడని 100 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, శరీరంపై గాయాలు గమనించి అనుమానం వ్యక్తం చేశారు. సమీపవాసులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ స్పిడ్ పెంచారు.

Advertisement

పోలీసుల అదుపులో నిందితురాలు చిట్టి ..
పోలీసులు చిట్టిని తమదైన శైలిలో విచారించగా, ఆమె మొదట ఖండించినప్పటికీ, చివరికి నిజం ఒప్పుకుంది. తాను హరీశ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు చిట్టిని అరెస్ట్ చేసి, హరీశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ కేసును హత్యగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే హరీశ్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

Also Read: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..కేసీఆర్ VS రేవంత్!

పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలింపు
ఇప్పుడు జరిగిన ఈ హత్య వివాహేతర సంబంధాలు ఎంత ప్రమాదకరమైనవో చెబుతుంది. కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, చిట్టి ఈ దారుణానికి పాల్పడటం సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×