E-Paper
Advertisement

Tollywood Actress: చేతిలో ఒక్కసినిమా లేదు.. సంపాదన మాత్రం కోట్లలో..ఈ నటి ప్లానింగ్ మామూలుగా లేదు భయ్యా!

Tollywood Actress: చేతిలో ఒక్కసినిమా లేదు.. సంపాదన మాత్రం కోట్లలో..ఈ నటి ప్లానింగ్ మామూలుగా లేదు భయ్యా!
Advertisement

Tollywood Actress: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి అనుష్క శెట్టి(Anushka Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి తదుపరి సినిమాలలో పెద్దగా నటించలేదు ఈమె తన వ్యక్తిగత కారణాలవల్లే సినిమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు..

ఇటీవల ఈమె ఘాటీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇలా అనుష్క సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేయడంతో అభిమానులు కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క చేతిలో ఒక్క సినిమా లేకపోయినా ఈమె ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నారని తెలుస్తోంది. సినిమా అవకాశాలు లేకపోయినా అనుష్క కోట్లలో సంపాదించడం వెనుక గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

అనుష్క నికర ఆస్తుల విలువ రూ.133 కోట్లు..

Advertisement

అనుష్క ఇన్ని రోజులు సినిమాలలో నటించి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులను పెట్టారని సమాచారం. ఇలాబ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, రియల్ ఎస్టేట్, పెట్టుబడుల ద్వారా నెలకు దాదాపు కోటి రూపాయల ఆదాయం పొందుతూ ఆర్థికంగా స్థిరపడ్డారని తెలుస్తోంది. పలు నివేదికల సమాచారం ప్రకారం అనుష్క నికర ఆస్తుల విలువ సుమారు 133 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇలా సినిమాలలో నటించి సంపాదించింది మొత్తం పెట్టుబడులు పెడుతూ ఇప్పుడు ఆదాయం పొందుతున్నారనే విషయం తెలిసి అభిమానులు అనుష్క ఆలోచనలకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా?

Advertisement

అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సినిమాలలో దాదాపు నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈమె ఒక్క సినిమాకు 6 నుంచి 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అనుష్క సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు ఘాటి తర్వాత ఈమె ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదని చెప్పాలి. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘాటీ సినిమా కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇక తదుపరి అనుష్క కొత్త సినిమాలను ప్రకటిస్తూ యధావిధిగా ప్రేక్షకుల ముందుకు వస్తారా లేదంటే పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల కాలంలో అనుష్క కనీసం మీడియా ముందుకు రావడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. అధిక శరీర బరువు కారణంగానే ఈమె సినిమాలకు దూరమవుతున్నారని తెలుస్తోంది.

Also Read: Ramayan Film: రామాయణ నుంచి రణబీర్ సాయి పల్లవి ఫోటోలు లీక్.. చిత్ర బృందం రియాక్షన్ ఇదే!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×