E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే? కిక్కే కిక్కు!

Ustaad Bhagat Singh: థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే? కిక్కే కిక్కు!
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమా నిర్మాతలు ప్రకటించిన ప్రకారం మార్చి 19న విడుదలయ్యేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాపై, ప్రస్తుతం అంతటా పాజిటివ్ బజ్ ఏర్పడింది. సంక్రాంతి సినిమాల తర్వాత సరైన సినిమా లేక ప్రేక్షకులు కూడా, ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా అనుకున్న టైమ్‌కి వస్తుందా? రాదా? అని అనుమానంలో ఉన్న వారు కూడా, సెన్సార్ పూర్తి అనే మాట విన్న తర్వాత, ఆ డౌట్స్ వదిలి, సెలబ్రేషన్ మోడ్‌లోకి వచ్చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా మార్చి 19 లేదంటే మార్చి 18న ప్రీమియర్స్‌తోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read- Raghavendra Rao: శ్రీలీల తల్లి అందంపై రాఘవేంద్రరావు కామెంట్స్.. 20 ఏళ్ల ముందు చూసి ఉంటే అంటూ..!

మరో చార్ట్ బస్టర్.. రాస్కోరా సాంబ!

Advertisement

ఇక సినిమా రిలీజ్‌కు సంబంధించి మేకర్స్ కూడా ఫుల్ క్లారిటీగా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమాపై ఉన్న హైప్‌ను పెంచుతుండగా, మరోవైపు నిర్మాతలు చిత్ర పాటలను వదులుతూ ఫ్యాన్స్‌లో జోష్ తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడో పాట విడుదలకు సంబంధించిన అప్డేట్‌తో పాటు సాంగ్ ప్రోమోని కూడా మేకర్స్ వదిలారు. ఇప్పుడీ ప్రోమో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు వచ్చిన పాట మాములుగా లేదు. ఇది కూడా చార్ట్ బస్టరే అనేలా ఉంది.

Also Read- Tollywood Actress: చేతిలో ఒక్కసినిమా లేదు.. సంపాదన మాత్రం కోట్లలో..ఈ నటి ప్లానింగ్ మామూలుగా లేదు భయ్యా!

సచ్చే దాకా కిక్కే ఉండాలే

Advertisement

‘ఎక్కే దిగే కిక్కులోన దక్కేదేవుందే.. అరె సచ్చే దాకా కిక్కే ఉండాలే’ అంటూ ఫ్యాన్స్‌కు కిక్కేక్కించేలా ఉన్న ఈ పాటకు దేవిశ్రీ అందించిన స్వరాలు, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం, రామ్ మిరియాల గాత్రం.. ఇవన్నీ వేటికవే సాటి అనేలా ఉంటే, అసలీ పాటలో పవన్ కళ్యాణ్ కనబడిన తీరు వాళ్లని ఫిదా చేసేస్తోంది. ‘కాలరే ఎత్తరా’ (Collar Ey Etthara Song Promo) అంటూ వచ్చిన ఈ సాంగ్ ప్రోమోలో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌ని ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో.. అలా కనిపిస్తున్నారు. డ్యాన్స్ కూడా ఇరగ్గొట్టేశారు. ‘గబ్బర్ సింగ్’ వైబ్ కనబడుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌తో చెలరేగిపోతున్నారంటే.. పాట ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ మాములుగా ఉండదనేలా.. ఈ సాంగ్ ప్రోమోతో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మార్చి 12, సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ ప్రోమోలో తెలిపారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also Read- Renu Desai: సైబర్ క్రైమ్‌కు రేణు దేశాయ్ ఫిర్యాదు.. అసలు విషయమిదే!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×