Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఎన్ని రోజులు హౌస్ లో ఉంటారో తెలియదు. ఉన్నన్ని రోజులుగా ఆటలో సత్తాను చాటుతు ఉంటే వాళ్లు టాప్ ఓటింగ్ లో దూసుకుపోతుంటారు. ఎనిమిదోవ వారం ఎలిమినేషన్ తర్వాత తొమ్మిదోవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది ఆసక్తి నెలకొంది. అయితే తొమ్మిదో వారం నామినేషన్స్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ మధ్య బిగ్ బాస్ ఓటింగ్ కూడా తారుమారవుతూ వస్తుంది. దానివల్ల హౌస్ లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చెప్పడం కష్టమవుతుంది. ఈవారం ఓటింగ్ మాత్రం ఎవరు ఊహించని విధంగా జరగడంతో విన్నర్ పొజిషన్ మారిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ అనేది చూస్తే టాప్ లో మాత్రం తనూజ లేదు.. మరొకరు ఉన్నారు. అతని ఓటీంగ్ పెరిగిపోతుంది. ఇదే కొనసాగితే మాత్రం టాప్ లోకి రావడం మాత్రమే కాదు. విన్నర్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . ఇంతకీ అతను ఎవరంటే..?
బిగ్ బాస్ లో తొమ్మిదో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. టాప్ కంటెస్టెంట్లు నామినేషన్స్ లోకి రావడంతో ఆడియన్స్ వీరిలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఓటింగ్ మాత్రం దారుణంగా పడిపోయిందని చెప్పాలి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఓటింగ్ చాలా వరకే తగ్గిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తొమ్మిదోవారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, భరణి, రాము, సాయి శ్రీనివాస్ ఈ ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఓటింగ్ ను చూస్తే.. తనూజ 33 శాతం ఓటింగ్, కళ్యాణ్ పడాల 22 శాతం, సుమన్ శెట్టి 15 శాతం, భరణి 10 శాతం, సంజన 9 శాతం,రాము రాథోడ్ 8 శాతం, సాయి శ్రీనివాస్ 3 శాతం ఉన్నారు.
గత సీజన్లని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ సీజన్లో కూడా కామనర్స్ విన్నారుగా నేను అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే తనుజ తర్వాత కళ్యాణ్ ఆస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు అతను ఎలిమినేట్ అవ్వకుండా గేమ్స్ లో తన సత్తాని చాటుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇతనే విన్నర్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కూడా పోల్స్ చెబుతున్నాయి. మరి ఎవరు విన్నర్ అవుతారో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Also Read : ప్రభావతిలో ఈ టాలెంట్ కూడా ఉందా..? కూతురు, కొడుకుతో కలిసే ఆ పని..
తొమ్మిదవ వారం సాయి శ్రీనివాస్ హౌస్ లో నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం అతని ఓటింగ్.. హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న అందరితో పోలిస్తే అతను లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు. దాంతో అతని ఈ వారం బయటికి వెళ్లే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. మరి అతను వెళ్తాడా ఆ తర్వాత డేంజర్ లో ఉన్న రామ్ రాథోడ్ వెళ్తాడా అన్నది ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అన్నది తెలియాలంటే మరో రెండు రోజుల్లో రాబోతున్న వీకెండ్ ఎపిసోడ్ నేమ్ మిస్ అవ్వకుండా చూడాలి..