Allu Sirish wedding: అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి కార్యక్రమం ముగియగానే అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు మొదలు కావటం విశేషం. అల్లు శిరీష్ నైనిక రెడ్డి వివాహం మార్చి ఆరవ తేదీ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇదివరకే కుటుంబ సభ్యులతో కలిసి పసుపు దంచే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తాజాగా పెళ్లి కొడుకు ఫంక్షన్ కూడా నిర్వహించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అల్లు శిరీష్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.
పెళ్లి కొడుకు ఫంక్షన్ లో భాగంగా కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ జరిగిందని ఈయన షేర్ చేసిన వీడియో చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ పెళ్లి కొడుకు ఫంక్షన్ లో కొత్త విరోష్ దంపతులు కూడా పాల్గొనడం విశేషం. విజయ్ దేవరకొండ రష్మిక ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చేసారు రిసెప్షన్ కోసం ఇక్కడ అతిథులను ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే అల్లు వారిని ఆహ్వానించడం కోసం అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది .ఈ కొత్త జంట కూడా ఈ పెళ్లి కొడుకు ఫంక్షన్ లో కనిపించి సందడి చేశారు. ఇలా కుటుంబ సభ్యులు ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఇక మార్చ్ 6వ తేదీ నైనిక అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ జంట మార్చి 2వ తేదీ అల్లు స్టూడియోస్ లో ఎంతో ఘనంగా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోబోతున్నారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు మొత్తం హాజరు కాబోతున్నారు. ఇక వీరి వివాహం కూడా అల్లు స్టూడియోలో కేవలం సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తోంది.
?igsh=MXB5Y2JvZGZkb2h6dQ%3D%3D
ఇక అల్లు శిరీష్ వివాహపు వేడుకల నేపథ్యంలో అల్లు అర్జున్ సైతం తన సినిమా షూటింగ్ పనులకు విరామం ఇచ్చారు. పెళ్లి తర్వాత తిరిగి ఈయన అట్లీ సినిమా పనులలో బిజీకానున్నారు. ఇక శిరీష్ పెళ్లి విషయానికి వస్తే ఈయన గత రెండు సంవత్సరాలుగా నైనిక రెడ్డితో ప్రేమలో ఉన్నారు. నైనిక రెడ్డి పారిశ్రామిక వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తోంది. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.
Also Read: Ranabaali: అది పోస్టర్ కాదు.. అపురూప క్షణం…రణబాలి పోస్టర్ పై డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!