E-Paper
Advertisement

Allu Shirish: ఇక్కడ కూడా బన్నీని ఫాలో అవుతున్న శిరీష్.. పెళ్లి విషయంలో అన్నను కాపీ కొట్టిన తమ్ముడు

Allu Shirish: ఇక్కడ కూడా బన్నీని ఫాలో అవుతున్న శిరీష్.. పెళ్లి విషయంలో అన్నను కాపీ కొట్టిన తమ్ముడు

Allu Shirish: అల్లు కుటుంబంలో త్వరలోనే పెళ్లి భాజాలు మోగబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ (Allu Shirish)వివాహం ఎంతో ఘనంగా జరగబోతోంది. అల్లు శిరీష్ నైనిక (Nainika)అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు వీరి వివాహం మార్చి 6 వ తేదీ జరగబోతుందని స్వయంగా శిరీష్ తెలియజేశారు. ఇలా పెళ్లి తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెళ్లి పనులను కూడా ప్రారంభించారని తెలుస్తోంది. ఇకపోతే అల్లు శిరీష్ పెళ్లి తేదీ అలాగే తన అన్నయ్య అల్లు అర్జున్(Allu Arjun) పెళ్లి తేది కూడా ఒక్కటే కావటం విశేషం. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల వివాహం కూడా మార్చి6 వ తేదీ 2011 న జరిగింది. ఇక 2026 మార్చి 6వ తేదీ అల్లు శిరీష్ పెళ్లి జరగటం విశేషం.

అల్లు అర్జున్, శిరీష్ పెళ్లి తేదీ ఒకటే..

ఇక అల్లు అర్జున్ సైతం ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిని కాకుండా బిజినెస్ ఫ్యామిలీకి చెందిన స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక అల్లు శిరీష్ సైతం నైనిక రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా వీరిద్దరి పెళ్లి విషయంలో వీరి భార్యల విషయంలో ఒకే సిమిలారిటీస్ ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు ఏంటి శిరీష్ పెళ్లి విషయంలో కూడా అన్నయ్యనే కాపీ కొట్టాలా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించిన విషయాలన్నింటినీ ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.

దుబాయిలో బ్యాచిలర్ పార్టీ..

అల్లు శిరీష్ పెళ్లికి ఇంకా నెలరోజులు సమయం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే తన స్నేహితులందరికీ విదేశాలలో ఎంతో ఘనంగా బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుబాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయని త్వరలోనే పెళ్లి ఎక్కడ ఏంటి అనే విషయాలను కూడా వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అల్లు శిరీష్ రెండు సంవత్సరాల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

అల్లు శిరీష్ నైనిక ప్రేమ వివాహం..

రెండు సంవత్సరాల క్రితం నైనిక తనకు పరిచయం అయ్యిందని స్వయంగా తన లవ్ స్టోరీని అల్లు శిరీష్ బయట పెట్టారు. మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి బ్యాచిలర్ పార్టీలో మొదటిసారి నైనిక రెడ్డిని కలిసినట్టు శిరీష్ తెలిపారు. నైనిక మరొక హీరో నితిన్ భార్య శాలినికి చాలా మంచి స్నేహితురాలు. వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీకి వీరిద్దరూ కలిసి రావడంతో అక్కడ నైనిక పరిచయం అయిందని ఆ పరిచయం ప్రేమగా మారిందని శిరీష్ తెలిపారు. ఇలా రెండు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు.

Also Read: Mrunal Thakur: ఆ హీరో నాకు అన్నయ్యతో సమానం… షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మృణాళ్ !

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×