E-Paper
Advertisement

South Indian Romantic Movies OTT : ప్రేమతో ప్రేక్షకులను పడగొట్టిన సౌత్ సినిమాలు… ఇవి ఆనంద భాష్పాలు తెప్పించే అద్భుతాలు

South Indian Romantic Movies OTT : ప్రేమతో ప్రేక్షకులను పడగొట్టిన సౌత్ సినిమాలు… ఇవి ఆనంద భాష్పాలు తెప్పించే అద్భుతాలు
Advertisement

South Indian Romantic Movies OTT : ప్రేమ ఎంత బాధ కలిగిస్తుందో, అంతే ఆనందం కూడా ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సౌత్ సినిమాలను చూస్తే ప్రేమ ఎంతబాగుంటుందో అనిపిస్తుంది. అంతేకాదు ఇవి మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమ కథలు కూడా. ప్రేమ మొదలైనప్పుడు స్వీట్ ఫీలింగ్, మధ్యలో హార్ట్‌బ్రేక్ పెయిన్, చివరికి ఆనంద భాష్పాలు రాల్చేలా ఉంటాయి ఈ స్టోరీలు. వీటి క్లైమాస్ కి టిష్యూ బాక్స్ కూడా పక్కన ఉండాల్సిందే కళ్ళు తుడుచుకోవడానికి. మరి ఆ సినిమా పేర్లు, ఏ ఓటీటీలో ఉన్నాయి ? అనే వివరాల్లోకి వెళ్తే..

Sita Ramam (2022) 

రామ్ (దుల్కర్ సల్మాన్) అనే సైనికుడు, సీత (మృణాల్ ఠాకూర్) అనే యువతి చుట్టూ కథ ఉంటుంది. స్టోరీ మొత్తం ఒక లెటర్ ద్వారా మొదలవుతుంది. సీత రామ్‌కి లెటర్ రాస్తుంది, ఆ లెటర్ చదివి అతను ప్రేమలో పడతాడు. కానీ ఎవరు ఆ అమ్మాయి అని తెలియదు. మధ్యలో వార్ సీన్స్ కూడా వస్తాయి. అతను 20 ఏళ్లు శత్రువుల చేతిలో బంధీ అవుతాడు. క్లైమాక్స్‌లో వీళ్ళు కలిసే సీన్ చూస్తుంటే ఆనంద భాష్పాలు రాకుండా ఉండవు. ఐయండిబిలో ఈ సినిమా 8.5/10 రేటింగ్ పొందింది. Prime Video లో ఈ సినిమాని చూడొచ్చు

Hridayam (2022) 

Advertisement

ప్రణవ్ మోహన్‌లాల్ హీరో గా నటించిన ఈ సినిమా, కాలేజీ లైఫ్ నుంచి మొదలై మెచ్యూర్ లవ్ వరకు సాగుతుంది. మొదటి లవ్ ఫెయిల్ అవుతుంది. తర్వాత సెకండ్ చాన్స్ మరింత మెచ్యూర్ గా లవ్ సాగుతుంది. సాంగ్స్ చూస్తుంటే మన కాలేజీ రోజులు గుర్తొచ్చేస్తాయి. ఇందులో ఎమోషన్స్ రియల్‌గా ఉంటాయి. ఇక చివరి సీన్స్‌లో ఆనంద భాష్పాలు పక్కా వస్తాయి. IMDbలో ఈ సినిమా 8.1/10 రేటింగ్ పొందింది. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఈ సినిమాను. Jio Hotstarలో

Gita Govindam (2018)  

విజయ్ దేవరకొండ (గోవింద్), రష్మిక మందన్న (గీత) నటించిన ఈ సినిమాను చూస్తుంటే హార్ట్ మెల్ట్ అవుతుంది. బస్‌లో మొదలైన మిస్ అండర్‌స్టాండింగ్ తో గోవింద్‌ను ప్లే బాయ్ అనుకుని గీత అవాయిడ్ చేస్తుంది. మధ్యలో ఫన్ సీన్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి. హిట్ సాంగ్స్, కామెడీ టైమింగ్ తో స్టోరీ సూపర్ గా ఉంటుంది. IMDbలో ఈ సినిమా 7.7/10 రేటింగ్ పొందింది.  Jio Hotstarలో చూడొచ్చు ఈ మూవీ అందుబాటులో ఉంది.

96 (2018) 

Advertisement

విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమా ఎమోషనల్ గా ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. స్కూల్ ఫ్రెండ్స్ 22 ఏళ్ల తర్వాత రీయూనియన్‌లో మీట్ అవుతారు. పాత ప్రేమ గుర్తుచేసుకుంటారు. మధ్యలో ఫ్లాష్‌బ్యాక్స్ తో కళ్లలో నీళ్లు తెప్పించే సీన్స్ ఎన్నో ఉంటాయి. IMDbలో ఈ సినిమా 8.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమాని చూస్తుంటే పాత మెమరీస్ గుర్తొచ్చేస్తాయి. Prime videoలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Dia (2020)

దియా అనే అమ్మాయి ప్రేమలో కుశల్, పవన్ పడతారు. అయితే ఊహించని ట్విస్ట్లు దియా లైఫ్ తో ఆటాడేసుకుంటాయి.ఈ ట్రయాంగిల్ ప్రేమ కథను ఎవరు చూసినా ఆనంద భాష్పాలు గ్యారెంటీ. దీనికి IMDbలో 8.0/10 రేటింగ్ ఉంది. Prime Videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also :  హర్రర్ మూవీ లవర్స్ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన మూవీస్… ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×