E-Paper
Advertisement

Hyderabad Metro Rail: అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు.. న్యూ ఇయర్ వేళ సమయాల్లో మార్పులు

Hyderabad Metro Rail: అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు.. న్యూ ఇయర్ వేళ సమయాల్లో మార్పులు
Advertisement

Hyderabad Metro Rail: హైదరాబాద్ వాసులకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో సేవలను పొడిగించారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న మెట్రో టైమింగ్స్‌లో మార్పులు చేశారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా నగరంలో పలు ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు చేస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.

అర్ధరాత్రి వరకు

సాధారణ రోజుల్లో మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 31న మాత్రం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు మెట్రోను ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు వెళ్లేందుకు మెట్రో బెటర్ ఆప్షన్ అని తెలిపారు.

ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో

Advertisement

హైదరాబాద్ లో డిసెంబర్ 31న రాత్రి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. సొంత వాహనంలో ఎక్కడికైనా వెళ్లేందుకు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇబ్బందులు తప్పవు. కొత్త ఏడాది సందర్భంగా మెట్రో రైళ్లు, స్టేషన్లలో పోలీసులు, మెట్రో సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టనున్నారు. దీంతో ప్రయాణికులు బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని మెట్రో అధికారులు కోరారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×