E-Paper
Advertisement

Anil Ravipudi on Shivaji: ‘తప్పు లేదు’… శివాజీ కామెంట్స్‌పై అనిల్ రావిపూడి రియాక్షన్

Anil Ravipudi on Shivaji: ‘తప్పు లేదు’… శివాజీ కామెంట్స్‌పై అనిల్ రావిపూడి రియాక్షన్
Advertisement

Anil Ravipudi On Sivaji: టాలీవుడ్ నటుడు శివాజీ (Sivaji)దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యల కారణంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ ఘటన పట్ల స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇక శివాజీ వ్యాఖ్యలను నటి అనసూయ పూర్తిగా తప్పు పడుతూ గత వారం రోజులుగా వరుస పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇలా ఈ వివాదం ఇప్పటికి సర్దుమనగలేదని చెప్పాలి. ఇలా ఈ వివాదం గురించి పలువురు సెలబ్రిటీలకు తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

మెగా విక్టరీ మాస్ సాంగ్..

ఈ నేపథ్యంలోనే ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెగా విక్టరీ మాస్ సాంగ్ అంటూ సాగిపోయే ఈ పాటను నేడు విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అనిల్ రావిపూడికి మీడియా వారి నుంచి శివాజీ వివాదం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే శివాజీ వ్యాఖ్యలపై అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ఆ కామెంట్స్ చాలా సున్నితమైన అంశానికి సంబంధించినవి, ప్రతి ఒక్కరు దాని గురించి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు..

Advertisement

ఇక ఈ వివాదం గురించి నేను ఒకటి చెబితే అది నచ్చని వాళ్ళు నాపై దాడి చేస్తారు. ఇలాంటి విషయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవించడంలో ఏమాత్రం తప్పులేదు. ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఒక్క విషయంపై స్పందించి మన అభిప్రాయాలు చెప్పడం సరైన పద్ధతి కాదు అంటూ ఈ సందర్భంగా అనిల్ రావిపూడి శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వివాదం గురించి పొరపాటున తప్పులు దొర్లితే త్వరలో రాబోయే తన సినిమాపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతోనే అనిల్ రావిపూడి చాలా తెలివిగా సమాధానం చెప్పారంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంక్రాంతి పండుగకు..

Advertisement

ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. చిరంజీవి నయనతార జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస అప్డేట్స్ తెలియజేస్తూ ప్రమోషన్లను భారీగా నిర్వహిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటేనే హిట్ అనే సంగతి తెలిసిందే .అలాంటిది చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేసిన నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Also Read: Garikipati – Sivaji: వాటితో మాకు సంబంధం లేదు.. శివాజీ వివాదంపై గరికపాటి సీరియస్

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×