E-Paper
Advertisement

Anaganaga Oka Raju Trailer: నాగార్జున వాయిస్ తో అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్!

Anaganaga Oka Raju Trailer: నాగార్జున వాయిస్ తో అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్!
Advertisement

Anaganaga Oka Raju Trailer: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాలలో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించిన అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary)నటించారు ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఈ ట్రైలర్ వీడియో 2:35 నిమిషాల నిడివితో విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఫన్ ఫుల్లుగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఎప్పటిలాగే నవీన్ పోలిశెట్టి పంచ్ డైలాగులు, మీనాక్షి చౌదరి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ కోసం నవీన్ పోలిశెట్టి చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తూ విడుదల చేసిన ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేయడమే కాకుండా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పాలి. మరి 14వ తేదీ రాబోతున్న రాజుగారు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

సింగర్ గా మారిన పోలిశెట్టి..

Advertisement

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో స్వయంగా నవీన్ పోలిశెట్టి ఒక పాటను కూడా పాడిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో వేచి చూడాలి. తెలుగు ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. జనవరి 9వ తేదీ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ విడుదల కాగా 12వ తేదీ మన శంకర వరప్రసాద్ గారు జనవరి 13వ తేదీ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి విడుదల కానుంది జనవరి 14న అనగనగా ఒక రాజు విడుదలకు సిద్ధమైంది.

Advertisement

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లను ఎదుర్కొంటున్న నాగ వంశీ కొత్త ఏడాదిలో సరికొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా నాగ వంశీకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమా పట్ల మంచి పాజిటివ్ బజ్ ఉండటమే కాకుండా, ఈ సినిమా నాన్ థియెట్రికల్ బిజినెస్,ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుపుకుందని తెలుస్తుంది. కేవలం నాన్ థియెట్రికల్ బిజినెస్ ద్వారా ఈ సినిమా లాభాలలోకి వచ్చిందని తెలుస్తోంది.

Also Read: Anasuya on Sivaji: శివాజీ మాట్లాడింది కరెక్టే.. వెనక్కి తగ్గిన అనసూయ !

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×