E-Paper

సోషల్ మీడియాలో రెచ్చిపోతే జైలుకే.. అనసూయపై అసభ్య కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్.. పూర్తి వివరాలివే!

సోషల్ మీడియాలో రెచ్చిపోతే జైలుకే.. అనసూయపై అసభ్య కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్.. పూర్తి వివరాలివే!
Advertisement

Anasuya Bharadwaj: జబర్ధస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ పై గత కొంతకాలంగా సోషల్ మీడియా ముసుగులో డిజిటల్ ఎటాక్ ఎంత దారుణంగా జరుగుతుందో తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని గతంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చెప్పలేనటువంటి బూతులతో తిడుతూ అసభ్యంగా ప్రవర్తించిన నల్గొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన దూరేపల్లి చంటిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

అనసూయ భరద్వాజ్ ఇచ్చిన కంపైంట్ ఆధారంగా

Advertisement

అయితే కేవలం అనసూయపైనే కాకుండా, మరికొంతమంది మహిళా సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని బూతులతో అసభ్యంగా దూషించినట్టు ఇతనిపై ఆరోపణలు ఉండటం గమనార్హం. ఇక తాజాగా అనసూయ భరద్వాజ్ ఇచ్చిన కంపైంట్ ఆధారంగా సాంకేతిక ఆధారాలతో నిందితుడిని ట్రాక్ చేసిన పోలీసులు, అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 75, 79, 336(4), 351, 356 తో పాటు ఐటీ చట్టం 66A, 67 కింద కఠినమైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు సమాచారం.

also read:సీతమ్మ గెటప్ నుంచి ఐటమ్ బాంబుగా.. ఊర మాస్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ

Advertisement

‘ఆంటీ’ అనే పదం అప్పట్లో పెద్ద దుమారం

అయితే, అనసూయ గతంలోనూ ఇలా నెగెటివ్ ట్రోల్స్ చేస్తూ అసభ్యంగా బూతులు తిట్టేవారి పట్ల గొంతెత్తడం మనకు తెలిసిందే. ముఖ్యంగా గతంలో “ఆంటీ” అనే పదాన్ని తనను ట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నారని, వయసును రీత్యా మహిళలను ఎగతాళి చేయడం నేరమని ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించి పెద్ద దుమారమే రేపింది. ఆ సమయంలో వరుసగా తనను ట్రోల్ చేసిన పలువురిపై ఆమె కేసులు పెట్టడమే కాకుండా, వారి అకౌంట్లను కూడా బ్లాక్ చేయించడం తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ అభిమానులతో జరిగిన వివాదంలోనూ తనపై జరిగిన డిజిటల్ ఎటాక్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది కూడా.

ఐపీ అడ్రస్ ఆధారంగా ప్రపంచంలో ఏమూలన ఉన్నా

ఇక లేటెస్ట్ గా మరోసారి జరిగిన అరెస్ట్ తో ఫేక్ idల మాటున దాక్కుని తిట్టేవారికి అనసూయ గట్టి సమాధానమే ఇచ్చినట్టు అయింది. మరో వైపు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉన్నామని తేల్చి చెప్పారు. ఫేక్ idలతో ఇలాంటి పనులు చేస్తే ఐపీ అడ్రస్ ఆధారంగా ప్రపంచంలో ఏమూలన ఉన్నా పట్టుకుని తీరతామని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఇంకెవరైనా మహిళల పట్ల అసభ్యంగా నెగటివ్ కామెంట్స్ చేసినా, వాళ్ళ గౌరవానికి భంగం కలిగేలా పోస్టులు పెట్టినా ఏమాత్రం సహించబోమంటూ వార్నింగ్ ఇచ్చారు.

సో చూశారుగా ఫ్రీడం ఉందిగా అని హద్దుమీరి నెట్టింట్లో అసభ్యంగా పోస్టులు పెట్టారో ఊచలు లెక్కపెట్టాల్సిందే. చూడాలి మరి ఈ అరెస్ట్లు ఎంతమందికి కనువిప్పు కలిగిస్తాయో!

also read:మెగా కాంపౌండ్‌లో ‘సర్జరీ’ల కలకలం! ఒకరి తర్వాత ఒకరు.. అసలు ఏమవుతోంది?

Related News

గట్టిగా చెప్పమన్న ప్రభాస్.. అరిచి మరీ చెప్పిన నాగ్ అశ్విన్.. వీడియో వైరల్!

మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మళ్లీ ఆ హీరోతోనేనా?

మళ్లీ థియేటర్లలో ‘ఆల్ ఈజ్ వెల్’.. రెండు దశాబ్దాల తర్వాత ‘3 ఇడియట్స్’ మ్యాజిక్!

అరబిక్ చిత్రసీమలోకి AR రెహమాన్ అడుగు.. ‘బాబ్’ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ రిలీజ్!

మైథలాజికల్ మిస్టరీతో వస్తున్న ‘నాగబంధం’.. ట్రైలర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన విరాట్ కర్ణ!

పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగినా మీకు ఆ అర్హత రాదు.. పేర్ని నానికి కిరాక్ ఆర్పీ లెఫ్ట్ అండ్ రైట్!

డబ్బుంది కదా అని బిల్డప్ లేదు.. నడిరోడ్డుపై నిద్రపోయిన బాలీవుడ్ సెలబ్రిటీ..

షారుక్ మాటతో 42 లక్షల బిల్లు మాఫీ..కట్ చేస్తే ఇప్పుడు 80 కోట్ల సినిమా

Big Stories

×