E-Paper
Advertisement

మహిళా భద్రత.. గళం విప్పిన స్టార్ సెలబ్రిటీస్.. ఇప్పటికైనా స్వేచ్ఛ లభిస్తుందా?

మహిళా భద్రత.. గళం విప్పిన స్టార్ సెలబ్రిటీస్.. ఇప్పటికైనా స్వేచ్ఛ లభిస్తుందా?
Advertisement

Tollywood:సమాజంలో మహిళల భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదు, మనందరి సామాజిక బాధ్యత అని చాటిచెప్పడానికి ‘స్టాండ్ విత్ హర్’ (Stand With Her) క్యాంపెయిన్ వేదికైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన క్యాంపెయిన్ హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరో సాయి దుర్గా తేజ్, సింగర్ చిన్మయి వంటి ప్రముఖులు గళం విప్పారు. ఆడబిడ్డలకు అండగా నిలబడటం అంటే ఏమిటో,సగటు మగవాడు అంటే ఏంటో తమ మాటలతో అందరినీ ఆలోచింపజేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: మహిళల భద్రతే మా ప్రాధాన్యత:

తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారు. అందుకే కీలకమైన పోలీస్ విభాగాల్లో మహిళా అధికారులనే నియమించామని గుర్తు చేశారు. “మీ ఇంట్లో ఆడపిల్లకు ఇబ్బంది కలిగితే ఎలా స్పందిస్తారో, బయట మహిళలకు వేధింపులు ఎదురైనప్పుడు కూడా అలాగే నిలబడి ప్రశ్నించాలి” అని యువతకు పిలుపునిచ్చారు. ఫిజికల్ క్రైమ్స్ కంటే ఇప్పుడు పెరుగుతున్న డీప్ ఫేక్ వీడియోలు, సైబర్ వేధింపుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు.

హీరో సాయి దుర్గా తేజ్: ప్రతి మహిళలో మీ అమ్మను చూడండి:

Advertisement

ఈ క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో సాయి దుర్గా తేజ్ గారు చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. “మనం మన తల్లిని ఎలాగైతే గౌరవిస్తామో, బయట కనిపించే ప్రతి మహిళను కూడా అలాగే గౌరవించాలి” అని సూచించారు. మార్పు అనేది మనం ఉదయం లేవగానే మన దుప్పటి మనం మడత పెట్టుకోవడం, తాగిన కాఫీ కప్పును సింక్‌లో పెట్టడం వంటి చిన్న పనులతోనే మొదలవ్వాలని చెప్పారు. మహిళలను ‘కేర్’ తీసుకుంటున్నామనే పేరుతో కంట్రోల్ చేయకూడదని, తప్పు జరిగినప్పుడు మౌనంగా ఉండకుండా ఎదిరించి నిలబడటమే అసలైన మగతనం అని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మాయి అనే పదాన్ని తక్కువగా చూడటం మానేయాలని పిలుపునిచ్చారు.

సింగర్ చిన్మయి: సమాజం మహిళల నోరు మూయించాలని చూస్తోంది:

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గారు తనదైన శైలిలో నిక్కచ్చిగా మాట్లాడారు. మహిళలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో నిర్భయంగా చెప్పగలుగుతున్నారా? అని ఆమె ప్రశ్నించారు. ఎవరైనా మహిళ గళం విప్పితే వెంటనే ఆమె వీడియోలను ఎడిట్ చేసి ట్రోల్ చేయడం, విడాకుల వంటి వ్యక్తిగత విషయాలపై అసత్య ప్రచారాలు చేయడం వంటివి సాధారణమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ మద్దతు చాలా ముఖ్యమని, తన భర్త రాహుల్ తనను అర్థం చేసుకోవడం వెనుక తన మామగారు అందించిన సంస్కారం ఉందని కొనియాడారు. మగవారు మహిళల పక్షాన నిలబడినప్పుడే ఈ సమాజంలో నిజమైన మార్పు వస్తుందని ఆమె ఆకాంక్షించారు.

చారు సిన్హా IPS: గౌరవం అనేది చిన్నప్పటి నుంచే నేర్పాలి:

Advertisement

మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ చారు సిన్హా గారు మాట్లాడుతూ.. “అగౌరవంగా ప్రవర్తించే పురుషులు పుట్టుకతోనే అలా ఉండరు, గౌరవం నేర్చుకోకుండా పెరగడం వల్లే అలా తయారవుతారు” అని ఒక పవర్‌ఫుల్ పాయింట్ చెప్పారు. మహిళల పట్ల పురుషుల్లో అవగాహన పెంచడమే ఈ ‘స్టాండ్ విత్ హర్’ ముఖ్య ఉద్దేశ్యం అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. మహిళా సాధికారతతో పాటు భద్రత కూడా మనందరి బాధ్యత అని చెప్పారు. పోలీసులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ వానర సైన్యంలా కలిసికట్టుగా మహిళల రక్షణ కోసం ముందుకు రావాలని ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.

ALSO READ:ఘనంగా విజయ్ దేవరకొండ , శౌర్యువ్ మూవీ పూజా కార్యక్రమం.. ముఖ్యఅతిథి ఎవరంటే?

మార్పు మన నుంచే మొదలవ్వాలి:

మొత్తానికి ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం మహిళల భద్రతపై ఒక కొత్త చర్చకు దారితీసింది. సెలబ్రిటీలు, అధికారులు చెప్పినట్లుగా మహిళలను గౌరవించడం అనేది ఒక రోజు చేసే పని కాదు, అది మన జీవనశైలిలో భాగం కావాలి. కేవలం చట్టాలు, పోలీసులు మాత్రమే భద్రతను ఇవ్వలేరు.. ఎదుటి మహిళలో మన అమ్మనో, చెల్లెల్నో చూసుకున్న రోజున ఈ సమాజం నిజంగానే సురక్షితంగా మారుతుంది. రేవంత్ రెడ్డి గారు అన్నట్లు, తప్పు జరిగినప్పుడు చూస్తూ ఊరుకోవడం కూడా నేరమే. కాబట్టి, మనందరం నేటి నుంచే ఆ మార్పు కోసం అడుగులు వేద్దాం!

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

View this post on Instagram

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Women Safety Wing, Telangana Police (@womensafetywing_tg)

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×