E-Paper
Advertisement

Chitra Rai: పెళ్లిరోజే మరో బిడ్డను ఆహ్వానించిన దేవర బ్యూటీ..

Chitra Rai: పెళ్లిరోజే మరో బిడ్డను ఆహ్వానించిన దేవర బ్యూటీ..
Advertisement

Chitra Rai: తెలుగు సీరియల్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు చైత్ర రాయ్. తెలుగులో అష్టాచమ్మా అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టి.. అందం, అభినయంతో ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. తెలుగులో అత్తారింట్లో అక్కచెల్లెళ్ళు , ఒకరికి ఒకరు, దట్ ఈజ్ మహాలక్ష్మి , రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె కన్నడలో అనేక సీరియల్స్ లో నటించి నటిగా మరింత పాపులారిటీ దక్కించుకుంది.

మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చైత్ర రాయ్..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో కీలక పాత్ర పోషించింది చైత్ర రాయ్. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సైలెంట్ గా 600 కోట్ల క్లబ్లో చేరి సక్సెస్ సాధించింది. దేవర పార్ట్ 2 లో కూడా చైత్ర రాయ్ కనిపించనున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఈమె తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే రెండవసారి కూడా అమ్మాయికి జన్మనిచ్చింది. అంతేకాదు ఈరోజు తమ 9వ పెళ్లిరోజు కూడా కావడం గమనార్హం.

9వ వివాహ వార్షికోత్సవం రోజే..

Advertisement

ఈ విషయాన్ని చైత్ర రాయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ..” ఒక అందమైన రహస్యం.. ఒక నిశ్శబ్ద అద్భుతం.. కృతజ్ఞతతో నిండిన హృదయం.. మా జీవితంలోకి దేవుడు ఇచ్చిన మరో ఆశీర్వాదాన్ని మేము స్వాగతించాము. రెండవసారి మరో అందమైన అమ్మాయి మా జీవితంలోకి వచ్చింది. మేం ఇద్దరం కాస్త ఇప్పుడు నలుగురం అయ్యాము. అలాగే ఈరోజు మా తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం కూడా.. ఈ సందర్భంగా మా ఆనందాన్ని ప్రపంచంతో పంచుకుంటున్నాము. మా జీవితాల్లోకి మరో యువరాణి అందులోనూ ఈ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రావడం.. మా జీవితానికి సంపూర్ణ పరిపూర్ణతలా అనిపిస్తోంది” అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది చైత్ర రాయ్.

అందమైన ఫోటో పంచుకున్న చైత్ర రాయ్..

మొత్తానికైతే మరో యువరాణికి జన్మనిచ్చాను అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా నలుగురు చేతులను ఫోటోగా పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. చైత్ర రాయ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Advertisement

also read:Bollywood: భారీ ఊరట.. 20 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి!

చైత్ర రాయ్ కెరియర్..

చైత్ర రాయ్ విషయానికి వస్తే.. చైత్ర రాయ్ విషయానికొస్తే.. కర్ణాటకలోని కూర్గులో బీడీ వాసు రాయ్, శ్రీమతి గులాబీ రాయ్ దంపతులకు జన్మించింది. ప్రముఖ ఇంజనీర్ ప్రసన్న శెట్టితో ఏడు అడుగులు వేసిన ఈమె తన భర్తతో కలిసి కర్ణాటకలోని మంగళూరు లో నివసిస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె.. వివాహమైన మరుసటి ఏడాది నవిష్క శెట్టి అనే అమ్మాయికి జన్మనిచ్చింది.

ఇప్పుడు రెండవ కూతురికి కూడా జన్మనిచ్చింది చైత్ర రాయ్. ఈమె తన నటనతో ఉత్తమ నటిగా స్టార్ పరివార్ అవార్డును అందుకోవడమే కాకుండా జీ తెలుగు బెస్ట్ డెబ్యూ జి కుటుంబం అవార్డును అందుకుంది.. అలాగే ఉత్తమ నటిగా కూడా జీ కుటుంబం అవార్డును సొంతం చేసుకుంది.

Related News

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?

సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న కాలభైరవ, కావ్య.. ఫొటో వైరల్!

ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీని రిజెక్ట్ చేసిన CBFC? మరీ అంత డార్క?

సందీప్ రెడ్డి వంగకు విజయ్ కాస్ట్లీ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే..

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..

మమిత బైజు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఆ లిస్ట్ లోకి చేరినట్లే..!

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల తేదీ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే..? 

Big Stories

Advertisement
×