Director BVS Ravi: నటుడు శివాజీ కామెంట్స్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యంగా ఈ వ్యవహారాన్ని నటి అనసూయ అసలు వదలడం లేదు. దీనిపై వరుస ట్వీట్స్, పోస్ట్స్ రెచ్చిపోతుంది. తనని తప్పుబడుతున్న కరాటే కళ్యాణ్, శివాజీకి గట్టి కౌంటర్స్ ఇస్తుంది. అంతేకాదు ఈ వ్యవహారంలో ఆమె లీగల్ చర్యలకు కూడా దిగింది. కాగా ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వ్యాఖ్యలను ఇండస్ట్రీ వర్గాలు సైతం వ్యతిరేకిస్తున్నారు.
తను తీరుపై వస్తున్న వ్యతిరేకతకు వెనక్కి తగ్గిన శివాజీ బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయినా ఈ వివాదం సద్దుమనగడం లేదు. శివాజీ క్షమాపణలు చెబుతూ.. నిండు బట్టలు వేసుకోమనడం తప్పా.. అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అంతేకాదు తన స్టేట్‌మెంట్ తప్పుకాదని, ఆ సమయంలో తాను వాడిన ఆ రెండు పదాలకే తాను క్షమాపణలు కోరుతున్నట్టు స్పష్టం చేశాడు. చివరిలో అనసూయని ఉద్దేశిస్తూ నీ రుణం తీర్చుకోనే అవకాశం ఇవ్వాలని దేవుడిని ప్రార్తిస్తున్నా అంటూ ఆమెకు చురకలు అట్టించారు. ఇక శివాజీ కామెంట్స్‌తో కోపంతో రగిలిపోతున్న అనసూయ.. వరుస ట్వీట్స్, పోస్ట్స్‌తో రెచ్చిపోతుంది.
అంతేకాదు శివాజీని మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ.. ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహరంలో కరాటే కళ్యాణ్ అనసూయని తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు నెటిజన్స్ నుంచి అనసూయ తీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నారు. కొందరు ఆమె మద్దతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అనసూయ వివాదంపై తాజాగా దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి స్పందించాడు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం చూస్తుంటే.. అనసూయకు మద్దతుగా.. మగావాళ్లకు వ్యతిరేకంగా ఉంది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ఆడదాని బట్టలు కాదు. మగవాడి బుద్ధి ఇక్కడ సమస్య అన్నారు. శివాజీది ఆందోళన దాటి విమర్శ అవ్వడమే ఇవాళ చర్చకు మూలమైందన్నారు. అనసూయ లాంటి వారి వాదన ఒక సామాజిక స్పృహ కి సంబంధించినదని, కాబట్టి ఎంతో ఓర్పు, బలమైన సహకారం అందరి నుంచి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: Bigg Boss Buzz: సంజనా ఆంటీ.. ‘బిగ్ బాస్’ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్.. శివాజీ షాకింగ్ కామెంట్స్
అదే విధంగా అలాగే “నిండుగా తల్లిలా తయారై బస్సులో బడికి వెళ్లే టీచర్స్, గుడి దర్శనం చేసుకునే ముత్తైదువులు, రైళ్లల్లో పుట్టింటికి వెళ్లే మహిళలు, స్కూల్కి వెళ్లే ఆడపిల్లలు, షాపింగ్లో, సినిమా హాళ్లలో, ఎక్కడపడితే అక్కడ, ఎలాంటి బట్టలు ఏ వయసు వాళ్లయినా.. చేతులెయ్యడం అనే రుగ్మత ఉన్న మగాడికి అవకాశమే హద్దన్నారు. ఇక్కడ ఆయన అనసయకు సపోర్టు చేస్తూ మగాళ్ల తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. బీవీఎస్ రవి చేసిన ట్వీట్పై అనసూయ కూడా స్పందించింది. బీవీఎస్ రవి పోస్టులను రీట్వీట్ చేస్తూ.. ఆయనకు థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా తన ట్వీట్కి కొన్ని ఎమోజీల జత చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.