Champion movie: ఈ రోజుల్లో హీరో అంటే ఆరడుగుల ఎత్తు ఉంటే సరిపోదు, విపరీతమైన అందం ఉన్న పెద్దగా పట్టించుకోవడం లేదు. టాలెంట్ ఉంటే ఎవరైనా హీరోగా ప్రూవ్ చేసుకోవచ్చు అని కొంతమంది రుజువు చేశారు. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలకు విపరీతమైన అందం లేదు. కానీ హీరోలుగా కొనసాగుతున్నారు.
అయితే విపరీతమైన అందం ఉండి కూడా ఒక సక్సెస్ఫుల్ సినిమా చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు కొంతమంది. అఖిల్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. తర్వాత చేసిన సినిమాలు కూడా వర్కౌట్ కాలేదు. మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అలానే సుదీర్ బాబు కి సమ్మోహనం సినిమా పేరు తీసుకొచ్చి పెట్టింది.
సహాయ నటుడిగా, హీరోగా అద్భుతమైన సినిమాలు చేసి విపరీతమైన పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. తన కొడుకు రోషన్ మేక ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అతను చేసిన పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో వర్కర్ కాలేదు. ప్రస్తుతం ఛాంపియన్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది.
అనస్వరా రాజన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తను హీరోయిన్గా చేసిన సినిమాలు అందరూ చూడకపోయినా కూడా ఇంస్టాగ్రామ్ రిల్స్ లో ఈమె వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఒక శ్రీకాంత్ కొడుకు రోషన్ ఎంత అందంగా ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అందుకే కాబోలు ఈమెను రోషన్ సరసన హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.
ఛాంపియన్ సినిమాలో అనస్వరరాజన్ చంద్రకళ అనే పాత్రలో కనిపిస్తుంది. ఈమెకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అలానే గ్లిమ్స్ వీడియో అన్ని నవంబర్ 22వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. అచ్చమైన తెలుగు అమ్మాయిలా అనిపిస్తుంది.
Chandrakala with #Champion… ✨
Unveiling the special glimpse Tomorrow. #Roshan @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @MickeyJMeyer @madhie1 @AshwiniDuttCh @SwapnaCinema @AnandiArtsOffl @ConceptFilms_ @zeestudiossouth @SonyMusicSouth#ChampionOnDec25th pic.twitter.com/zlgAVrlpT3
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) November 21, 2025
మరోవైపు ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ బ్యానర్ లో వచ్చిన కల్కి సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఛాంపియన్ సినిమా కోసం ఏమాత్రం రాజీ పడకుండా భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. సినిమాకి సంబంధించిన లింక్స్ వీడియో కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
Also Read: Anchor Sreemukhi : ముప్ప తిప్పలు తర్వాత ముగిసిన శ్రీముఖి విచారణ