E-Paper
Advertisement

12A Railway Colony Movie Review : 12A అనే రైల్వే కాలనీ రివ్యూ : ట్రైన్ ఇన్ రాంగ్ ట్రాక్

12A Railway Colony Movie Review : 12A అనే రైల్వే కాలనీ రివ్యూ : ట్రైన్ ఇన్ రాంగ్ ట్రాక్
Advertisement

12A Railway Colony Movie Review : అల్లరి నరేష్ నుండి ఈరోజు ’12A అనే రైల్వే కాలనీ’ అనే సినిమా ఈరోజు వచ్చింది అని చాలా మందికి తెలీదు అంటే ప్రమోషన్ ఎంత వీక్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి సినిమా ఎలా ఉంది? టాక్ తో పికప్ అయ్యేలా ఉందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథ :

కార్తీక్(అల్లరి నరేష్) వరంగల్ వాసి. అక్కడున్న 12A అనే రైల్వే కాలనీలో అతని ఫ్రెండ్స్ తో కలిసి నివసిస్తూ ఉంటాడు. కార్తీక్ అండ్ గ్యాంగ్ అక్కడి లోకల్ పొలిటీషియన్ టిల్లు(జీవన్) వద్ద పనిచేస్తూ ఉంటారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్తీక్ అండ్ ఫ్రెండ్ ను ఎటువంటి గొడవల్లోనూ చిక్కుకోవద్దని ఆదేశిస్తాడు టిల్లు. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండమని చెబుతాడు.ఈ టైంలో కార్తీక్ తన పక్కింటి అమ్మాయి అయిన ఆరాధనని(కామాక్షి భాస్కర్ల) చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కార్తీక్ పై ఇంట్రెస్ట్ ఉన్నట్టు అతన్ని తిప్పుకుంటుంది.

Advertisement

అలాగే ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్, తల్లితో కలిసి జీవిస్తుంది అని కార్తీక్ తెలుసుకుంటాడు. అయితే సడన్ గా ఆమె కనిపించకుండా పోతుంది. మూడు రోజులైనా కనిపించకపోవడం ఏంటి అని కార్తీక్ కన్ఫ్యూజ్ అవుతాడు. మరోపక్క టిల్లు… ఇల్లు అలాగే ఆఫీసులపై అలాగే అతని అనుచరులపై పోలీసులు రైడ్ చేస్తున్నారు అని తెలుసుకుని.. కొన్ని బ్యాగులను కార్తీక్ కు అప్పగిస్తాడు.

ఈ క్రమంలో కార్తీక్ ఆ బ్యాగులను ఆరాధన ఇంట్లో పెడితే సేఫ్ అని భావిస్తాడు. వెంటనే ఆమె ఇంటి ఫెన్సింగ్ ధాటి ఇంట్లోకి వెళ్తాడు. అయితే అక్కడ అతనికి ఆరాధన కనిపిస్తుంది. అంతేకాదు కాసేపటికే ఆమె డెడ్ బాడీ కూడా ప్రత్యక్షమవుతుంది. ఆరాధనని చంపింది ఎవరు? తర్వాత కార్తీక్ జీవితం ఎలా మారింది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

Advertisement

‘కన్ఫ్యూజ్ చేస్తే బాగా తెలివి ఉన్నట్టు అని’ థ్రిల్లర్ సినిమాలు తీసే దర్శకులను చాలా మంది సమీక్షకులు అందనమెక్కించి కూర్చోబెట్టారు. దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కూడా అదే నిజమనే భ్రమలో ఎక్కువగా ఉంటున్నట్టు స్పష్టమవుతుంది. ‘పొలిమేర’ నుండి అతను ఈ ఫార్ములానే ఎక్కువ ఫాలో అవుతున్నారు. తన శిష్యుడు దర్శకుడు అయినటువంటి నాని కూడా ఇదే నేర్చుకున్నట్టు స్పష్టమవుతుంది. ’12 A రైల్వే కాలనీ’ ట్రైలర్ చూస్తేనే ఇది నిజం అని సగం క్లారిటీ వచ్చేస్తుంది.

సహజంగా ట్రైలర్ కట్ రిలీజ్ చేసేది ఎందుకు..? సినిమా కథ, కథనాల పై హింట్ ఇచ్చి ఆడియన్స్ ని ‘ఏ సినిమా చూడబోతున్నారో?’ ప్రిపేర్ చేయడమే కదా.అదే కథా ట్రైలర్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ’12 A రైల్వే కాలనీ’ ట్రైలరే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. పోనీ కథనం ఏమైనా గొప్పగా ఉందా అంటే? ఇంటర్వెల్ వరకు అసలు కథ మొదలుకాదు. అప్పటివరకు ఎంగేజింగ్ గా ఉంటుందా అంటే అదీ లేదు. ఇప్పటివరకు మీరు చూసింది అంతా ఉత్తుత్తే అని ప్రేక్షకుడు సరిపెట్టుకోవాలి.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. సంబంధం లేని సన్నివేశాలు వచ్చి వెళ్తుంటాయి. క్లైమాక్స్ లో 2 ట్విస్టులు ఇచ్చి మమ అనిపించేశారు. ఇంకా చెప్పాలంటే ట్విస్టులపై పెట్టిన కాన్సెన్ట్రేషన్ సినిమా కథ, కథనాల పై దర్శకుడు పెట్టినట్టు లేడు. గురువు అనిల్ నే అతను ఫాలో అయ్యి ఉండొచ్చు. ఎడిటింగ్ కూడా ఏమీ ఆసక్తికరంగా ఉండదు.నిర్మాణ విలువలు గొప్పగా లేవు. లొకేషన్స్ కూడా నేచురల్ గా లేవు.ఎటొచ్చి ఈ సినిమాని 43 రోజుల్లో తీశారట. ఆ ఒక్క విషయంలోనే టీంని అభినందించాలి.

నటీనటుల విషయానికి వస్తే.. అల్లరి నరేష్ ఈ కథకి ఏమాత్రం సూట్ అవ్వలేదు. పూర్తిగా మిస్ క్యాస్ట్ అనిపించాడు. అతని పాత్రకి సరైన ఆర్క్ లేదు. మరి ఏ రకంగా ఈ పాత్రని ఎంపిక చేసుకున్నట్టు? అంటే ‘నా సామి రంగ’ నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ కి ఓకే చేసి ఉండొచ్చు.

కామాక్షి భాస్కర్ల కొత్తగా చేసింది ఏమీ లేదు. చాలా రొటీన్ గా కనిపించింది. లుక్స్ కూడా ఆకట్టుకునేలా లేవు. సాయి కుమార్ రోల్ గెస్ట్ రోల్. ఎలా ఉంటుంది అంటే బాహుబలిలో తనికెళ్ళ భరణి టైపు పాత్ర అనాలి. అందులో ఆ పాత్రకి ఎటువంటి క్లారిటీ ఉండదు. ఇందులో సాయి కుమార్ రోల్ కూడా అంతే అనుకోవాలి. జీవన్ నటన కూడా మెప్పించదు. అభిరామి మాత్రం బాగా చేసింది.

ప్లస్ పాయింట్స్ :

2 ట్విస్టులు

మైనస్ పాయింట్స్:

కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే
డైరెక్షన్
మ్యూజిక్

మొత్తంగా… ’12 A రైల్వే కాలనీ’ ఓ లాజిక్ లెస్ సైకోలాజికల్ థ్రిల్లర్ మూవీ. హిందీ సి.ఐ.డి సీరియల్స్ స్ఫూర్తితో తీశారు. 2 ట్విస్టులు మినహా ఇందులో ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు.

12A Railway Colony Movie Rating : 2 / 5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×