E-Paper
Advertisement

Anchor Sreemukhi : ముప్ప తిప్పలు తర్వాత ముగిసిన శ్రీముఖి విచారణ

Anchor Sreemukhi :  ముప్ప తిప్పలు తర్వాత ముగిసిన శ్రీముఖి విచారణ
Advertisement

Anchor Sreemukhi : టెక్నాలజీ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. అయితే టెక్నాలజీని ఉపయోగించుకునే విధానం పైనే అంత ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అంటే ఎవరికి తెలియదు. ఎక్కడో గ్రామాల్లోను, పట్టణాల్లోనూ కోళ్ల పందాలు, పేకాట ఇలాంటి జరుగుతూ ఉండేవి. అయితే వాటిని అడ్డుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఎలానో ఉంది కాబట్టి వాళ్ల స్థాయిలో వాళ్లు వాటిని అరికట్టగలిగారు.

కానీ మొబైల్ లో బెట్టింగ్ ఆడటం అనేది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్లు ఆలోచించాల్సిన విషయం. దానివలన ఏం కోల్పోతాము అనే రిలైజేషన్ వచ్చేసరికి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. చాలామంది బెట్టింగ్ యాప్స్ వలన ప్రాణాలు తీసుకున్నారనే వార్తలు కోకొల్లలు. ఈ బెట్టింగ్స్ అనేవి ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ దానిని ప్రమోట్ చేయడం వలనే సాధారణ ప్రేక్షకుడికి తెలుస్తుంది. ఇంతటి సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఉంది అని ఆసక్తికరంగా దానిని మొదలుపెడతారు. అలానే వాటికి అలవాటైపోతారు.

ముగిసిన శ్రీముఖి విచారణ 

Advertisement

చాలామంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ వంటి వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లందర్నీ విచారణ చేసిన సంగతి తెలిసిందే. అలానే ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా బెట్టింగ్ యాక్షన్ ప్రమోట్ చేశారు. ఇప్పుడు తనని కూడా సిఐడి అధికారులు విచారించారు.

దాదాపు గంటన్నర సమయం పాటు శ్రీముఖిని సిఐడి అధికారులు విచారించారు. శ్రీముఖి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వివరాలన్నిటిని సిఐడి డిపార్ట్మెంట్ సేకరించారు. అలానే శ్రీముఖి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా అడిగి తీసుకున్నారు.

Advertisement

అయితే శ్రీముఖికి ఆ విచారణలో ఎటువంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. తను ఏమి జవాబు ఇచ్చారు. అనే అంశాలు ఇంకా బయటకు రాలేదు. అయితే వీటి పైన శ్రీముఖి స్పందిస్తుందేమో వేచి చూడాలి.

నో బెట్టింగ్ యాప్స్

మొత్తానికి ఎక్కువ శాతం బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వెబ్సైట్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. అక్కడక్కడ కొంత మేరకు బెట్టింగ్స్ ఆడటానికి అవకాశం ఉండేటట్టు కొన్ని సైట్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ గా క్లోజ్ అయిపోతే, చాలామంది కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పొచ్చు. అసలు ఎలా ఉంటుందో అని ఎంట్రీ ఇచ్చి దాని నుంచి బయట పడలేక ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు చాలామంది యువత. వారందరినీ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇంకా సెలబ్రిటీలు కూడా మళ్లీ ప్రమోషన్స్ చేయకుండా ఉంటే అదే అసలైన మేలు.

Also Read: Telugu directors: రాజమౌళినే కాదు, ఈ దర్శకులు కూడా దేవుళ్ల పై మాట్లాడారు

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×