Galaxy F70e 5G vs Realme P4x 5G vs Redmi 15 5G| శాంసంగ్ ఇటీవల భారతదేశంలో గెలాక్సీ F70e 5G అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్.. రియల్‌మి P4x 5G, రెడ్‌మి 15 5Gతో పోటీ పడుతోంది. ఈ మూడు ఫోన్లు రూ.20,000 లోపు బడ్జెట్‌లో మంచి పర్‌ఫామెన్స్ కోరుకునే వారికి ఉపయోగపడతాయి. ధర, ఫీచర్లు, విలువ ఆధారంగా ఈ ఫోన్లను సులభంగా పోల్చి చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ F70e 5G 4GB+128GB వేరియంట్ రూ.12,999, 6GB+128GB ధర రూ.14,999.
రియల్‌మి P4x 5G 6GB+128GB రూ.15,499, 8GB+128GB రూ.16,999, 8GB+256GB రూ.17,999.
రెడ్‌మి 15 5G 8GB+128GB ₹15,999. ధర పరంగా శాంసంగ్ మంచి ఆప్షన్.
శాంసంగ్ గెలాక్సీ F70e 5Gలో 6.7 ఇంచ్ HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
రియల్‌మి P4x 5Gలో 6.72 ఇంచ్ FHD+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
రెడ్‌మి 15 5Gలో 6.9 ఇంచ్ FHD+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. రియల్మీ, రెడ్‌మీ డిస్‌ప్లేలు షార్ప్‌గా, స్మూత్‌గా ఉంటాయి.
శాంసంగ్ గెలాక్సీ F70e 5Gలో 6000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.
రియల్‌మి P4x 5Gలో 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. Redmi 15 5Gలో 7000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రియల్మీలో ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F70e 5G Android 16తో One UI 8లో రన్ అవుతుంది.
రియల్‌మి P4x 5G Android 15తో Realme UI 6.0లో ఉంది. రెడ్‌మి 15 5G Android 15తో HyperOS 2.0లో ఉంది. సామ్సంగ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో ఎక్కువ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ F70e 5Gలో మిడియాటెక్ డైమెన్సిటీ 6300 ఉంది.
రియల్‌మి P4x 5Gలో మిడియాటెక్ డైమెన్సిటీ 7400 Ultra ఉంది. రెడ్‌మి 15 5Gలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 ఉంది. రియల్మీ, రెడ్‌మీ ప్రాసెసర్లు గేమింగ్, హెవీ యూస్‌లో బాగా పనిచేస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ F70e 5Gలో 50MP ప్రైమరీ + 2MP డెప్త్ రియర్ కెమెరాలు, 8MP సెల్ఫీ ఉన్నాయి.
రియల్‌మి P4x 5Gలో 50MP మెయిన్ + 2MP సెకండరీ, 8MP సెల్ఫీ ఉన్నాయి.
రెడ్‌మి 15 5Gలో 50MP రియర్, 8MP సెల్ఫీ ఉన్నాయి. మూడు ఫోన్ల కెమెరాలు రోజువారీ ఉపయోగానికి సమానంగా ఉంటాయి.
Also Read: ఆన్‌లైన్ గ్రాసరీ ఆర్డర్ చేసేవారు తస్మాత్ జాగ్రత్త.. ఒక్క ఫోన్ కాల్‌తో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ
శాంసంగ్ గెలాక్సీ F70e 5Gలో 5G, Wi-Fi, Bluetooth 5.3, 3.5mm జాక్ ఉన్నాయి.
రియల్‌మి P4x 5Gలో 5G, Wi-Fi 6, Bluetooth 5.4 ఉన్నాయి. రెడ్‌మి 15 5Gలో 5G, Wi-Fi 5, Bluetooth 5.1 ఉన్నాయి. రియల్మీలో ఆధునిక కనెక్టివిటీ ఉంది.
తక్కువ ధర, ఎక్కువ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కావాలంటే శాంసంగ్ గెలాక్సీ F70e 5G బెస్ట్. గేమింగ్, హెవీ యూస్ కావాలంటే రియల్‌మి P4x 5G బాగుంటుంది. బ్యాటరీ, పనితీరు బ్యాలెన్స్ కావాలంటే రెడ్‌మి 15 5G మంచి ఆప్షన్. మీ అవసరాలను బట్టి ఎంచుకోండి.