E-Paper
Advertisement

Telangana Govt: జీహెచ్ఎంసీ ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, అధికారులు బాధ్యతలు స్వీకరణ

Telangana Govt: జీహెచ్ఎంసీ ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, అధికారులు బాధ్యతలు స్వీకరణ
Advertisement

Telangana Govt: ఎట్టకేలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ని మూడుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌-సీఎంసీ, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌-ఎంఎంసీగా విభజిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మున్సిపల్ కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు.

గ్రేటర్ హైదరాబాద్ ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ని మూడు కార్పొరేషన్లుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. వాటిలో జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేసింది. వెంటనే మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌‌గా ఆర్వీ కర్ణన్‌ను కంటిన్యూ కానున్నారు.

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌‌గా శ్రీజన బాధ్యతలు చేపట్టారు. మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌‌గా వినయ్‌ కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.

Advertisement

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. బాధ్యతలు స్వీకరించిన అధికారులు

మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగి కొత్త పాలక మండలి వచ్చేవరకు ప్రత్యేకాధికారిగా ఆయన కొనసాగనున్నారు. పాత గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లు ఉండేవి. డీలిమిటేషన్‌తో డివిజన్లు 243 చేరాయి. శివారు మున్సిపాలిటీలు విలీనంతో కొత్తగా మూడు నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. దీంతో 300 డివిజన్లకు విస్తరించింది జీహెచ్‌ఎంసీ.

పరిపాలన సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణ చేపట్టింది ప్రభుత్వం. దీంతో మూడు కార్పొరేషన్లుగా విభజన చేసింది. జీహెచ్‌ఎంసీ చట్టం-1955 చట్ట ప్రకారం జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లు కావడంతో జలమండలి పరిధి విస్తరించింది. ముగ్గురు అధికారులను ఈడీలుగా నియమించిన ప్రభుత్వం.

ALSO READ: టెట్‌ పరీక్షలో అనూహ్య పరిణామం.. గతేడాది కంటే పెరిగిన పర్సంటేజీ..?

ప్రస్తుతం జలమండలి ఈడీ పని చేస్తున్న మయాంక్ మిట్టల్‌ను జాయింట్ ఎండీ‌గా పోస్టింగ్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్‌గా ఉన్న పంకజకు జలమండలి మల్కాజ్‌గిరి ఈడీగా పోస్టింగ్ ఇచ్చింది. సామ్రాట్ అశోక్‌ను జలమండలి హైదరాబాద్ ఈడీగా, సంతోష్‌కు జలమండలి సైబరాబాద్ ఈడీగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా అధికారులు తమతమ ఆఫీసులో బాధ్యతలు చేపట్టారు.

జీహెచ్ఎంసీలోకి సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు రానున్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు వచ్చాయి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లతో కలిపి ఏర్పాటు చేసింది.

 

 

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×