E-Paper
Advertisement

Top 20 News Today: తమ్ముడి ప్రేమకు అన్న బలి, జాతీయ రహదారిపై దొంగల హల్‌చల్.. బస్సులో15 కేజీల వెండి బ్యాగ్ చోరి

Top 20 News Today: తమ్ముడి ప్రేమకు అన్న బలి, జాతీయ రహదారిపై దొంగల హల్‌చల్.. బస్సులో15 కేజీల వెండి బ్యాగ్ చోరి

1. టీడీపీ కూటమి ప్రభుత్వం పై జగన్ ట్వీట్

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో పూర్తిగా విఫలమైందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగ్ గణాంకాల ప్రకారం రాష్ట్ర సొంత పన్ను ఆదాయ వృద్ధి కేవలం 7.03శాతం మాత్రమే ఉందని, ఇది ఎన్నికల హామీలకు విరుద్ధమని ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వం అప్పుల్లోనే దూసుకుపోతోందని ఆరోపించారు.

2. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నారా లోకేష్ ట్వీట్

భారీ పెట్టుబడుల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారా?.. క్షమించండి.. ఈరోజు ఆదివారం.. మ్యాచ్ చూస్తున్నాం అంటూ మంత్రి నారా లోకేశ్ సరదాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని అందరూ ఆశిస్తున్న తరుణంలో లోకేశ్ ఈ విధంగా స్పందించారు.

3. నూతన పశువుల ఆసుపత్రి ప్రారంభం.. బాలకృష్ణ

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రూరల్ మలుగురు గ్రామంలోని నూతన పశువుల ఆసుపత్రిని ప్రారంభించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ప్రజల ఆరోగ్యంతో పాటు పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు.

4. సిద్దిపేటలో శ్రీ సత్యనారాయణ వ్రత పూజా వైభవం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

5. డిప్యూటీ సీఎం పై గిరిజనులు ఫైర్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గిరిజనులు మండిపడుతున్నారు. డోలిమోతల రహిత మన్యం ప్రాంతంగా మారుస్తామని, రహదారులు లేని ప్రతి గిరిజన గ్రామానికి రహదారులు నిర్మిస్తామన్న పవన్ కళ్యాణ్ మాటలు ఏమయ్యాయని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.

6. హిందూపురంలో ఉద్రిక్తత

హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి కేసులో 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మరోవైపు టీడీపీ నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో వైసీపీ ఇంచార్జ్ దీపిక భర్త వేణురెడ్డి సహా 8 మంది వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అలాగే, హిందూపురం వెళ్లకుండా ఇప్పటికే వైసీపీ నేతలు గోరంట్ల మాధవ్, ఉష శ్రీ హౌస్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

7. తిరుమల ఘాట్‌రోడ్డులో కారు బోల్తా

తిరుమల రెండవ ఘాట్‌రోడ్‌లో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులు ఉన్నారు. వారికి గాయలు కావడంతో పోలీస్ సిబ్బంది తిరుమల అశ్వినీ ఆసుపత్రికి తరలించారు.

8. తమ్ముడి ప్రేమకు అన్న బలి

రంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లిలో ప్రేమ వివాహం కారణంగా పరువు హత్య కలకలం రేపింది. కుమార్తెను ప్రేమించి తీసుకెళ్లిన వ్యక్తిపై ఆగ్రహంతో, ఆ అబ్బాయి అన్న రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి, కొట్టి, పెట్రోల్‌తో తగలబెట్టి చంపారు. తన భర్తను అన్యాయంగా హత్య చేశారని మృతుడి భార్య వాణి డిమాండ్ చేస్తోంది.

9. పోలీసులపై అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం

అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురం వద్ద వైసీపీ కార్యాలయంపై దాడిని పరిశీలించేందుకు వస్తున్న క్రమంలో వారిని అడ్డుకున్నారు. దీంతో తమను అడ్డుకోవడం దుర్మార్గమంటూ అనంత వెంకటరామిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

10. జాతీయ రహదారిపై దొంగల హల్‌చల్.. బస్సులో15 కేజీల వెండి బ్యాగ్ చోరి

నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై భారీ చోరీ జరిగింది. బస్సులోని 15 కేజీల వెండి బ్యాగ్‌ను చోరీ చేసి నలుగురు కారులో పరారయ్యారు. బాధితుడు సంగ్రామ్ డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సు కోయంబత్తూరు నుండి హైదరాబాద్‌కు వెళుతుండగా దొంగతనం జరిగింది.

11. శ్రీశైలంలో భక్తుల క్యూ

కార్తీక మాసం చివరి రోజు. ఆదివారం కావడంతో శ్రీశైలం దేవాలయానికి అయ్యప్ప, సామాన్య భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతోంది. ఈవో ఆదేశాల మేరకు, సిబ్బంది క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం అందిస్తున్నారు.

12. భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఆదివారం సెలవు కావడంతో భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 2 గంటలు పడుతోంది. నిత్యకళ్యాణంలో పాల్గొన్న భక్తులతో బేడా మండపం నిండిపోయింది.

13. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులపాటు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.

14.సనాతన ధర్మ పరిరక్షణే తన లక్ష్యం.. బండి సంజయ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని, ఇకనైనా మేల్కొని ఏకతాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా మారాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. మతం మారిన వారంతా ఘర్ వాపసీ ద్వారా తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని ఆయన కోరారు. సనాతన ధర్మ పరిరక్షణే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

15. 61 వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని BK ఫంక్షన్ హాల్‌లో 61 జంటలకు సామూహికంగా వివాహలు జరిగాయి. అప్ప శివ ఏర్పాటు చేసిన ఈ వేడుకలలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. అప్పశివ కుటుంబం పేదింటి వధూవరులకు పట్టు వస్త్రాలు, పెళ్లి సామాన్లు అందించి గొప్ప పనిచేశారని ఎమ్మెల్యే ప్రశంసించారు.

16. అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను ఇందల్వాయి వద్ద పట్టుకున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. వారి నుండి 40 కిలోల కాపర్ కాయిల్స్, 5.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

17. తొలి ప్రయత్నంలోనే చరిత్రలోకి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అతి పిన్న వయస్కురాలు మైథిలీ ఠాకూర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. భారత్‌లో 21వ శతాబ్దంలో జన్మించి ఎమ్మెల్యే అయిన మొదటి వ్యక్తి మైథిలీ మాత్రమే. అంతేకాకుండా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా పోటీ చేసిన మొదటి సారే ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

18. సీజే బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు

భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీజే బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానం ఉండాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు.

19. అభిమానుల ప్రేమకు కృతజ్ఞత

మహేశ్‌బాబు-రాజమౌళి చిత్రం వారణాసి టైటిల్ గ్లింప్స్ వేడుక నిన్న చాలా గ్రాండ్‌గా జరిగింది. తమపై ప్రేమ చూపిన అభిమానులు, మీడియాకు మహేశ్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో మరిన్ని ఈవెంట్లలో కలుద్దామని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు.

20. దళిత సంఘాల నేతల ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా పరువు హత్యపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజశేఖర్‌ హత్యకు నిరసనగా షాద్‌నగర్‌ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. రాజశేఖర్‌ కిడ్నాప్‌కు గురయ్యారని డయల్‌ 100కు కాల్‌ చేసినా.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దోషులను శిక్షించాలని.. మృతుడు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు దళిత సంఘాల నేతలు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×