E-Paper
Advertisement

Ram Pothineni-Bhagyasri: ఆంధ్ర కింగ్‌ తాలుకా ఎఫెక్ట్‌.. విడిపోతున్న లవ్‌బర్డ్స్‌!

Ram Pothineni-Bhagyasri: ఆంధ్ర కింగ్‌ తాలుకా ఎఫెక్ట్‌.. విడిపోతున్న లవ్‌బర్డ్స్‌!
Advertisement

Ram Pothineni-Bhagyasri Borse: హీరో రామ్‌ పోతినేనికి మంచి హిట్‌ పడి చాలా కాలం అవుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ అవి పెద్దగా వర్కౌట్‌ కావడం లేదు. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత అతడి ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్‌ లేదు. ఈ చిత్రం తర్వాత పాన్‌ ఇండియా సినిమాలు చేశాడు. అగ్ర దర్శకులతో జతకట్టాడు. అయినా కలిసి రాలేదు. అన్ని బాక్సాఫీసు వద్ద దారుణంగా బొల్తా కొడుతున్నాయి. ది వారియర్‌, స్కంద, డబుల్‌ ఇస్మార్ట్‌ ఇలా వరుగా డిజాస్టర్స్‌ చూశాడు. ఈసారి ఎలాగైనా మంచి కంబ్యాక్‌ ఇవ్వాలని అభిమానిగా వచ్చాడు.

భాగ్యశ్రీతో ప్రేమయాణం..

ఆంధ్ర కింగ్‌ తాలుకా అంటూ అభిమాని మూవీ తీశాడు. కానీ, ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. అయితే ఈ సినిమా మొదలైనప్పుటి నుంచి ఈ యంగ్ హీరో పర్సనల్‌ లైఫ్‌తో ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి. చాక్లేట్‌ బాయ్ లాంటి రామ్‌పై ఇప్పటి వరకు డేటింగ్‌ రూమర్స్‌ రాలేదు. ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్‌తో వచ్చినా అవి కొద్ది రోజులకే పరిమితమైంది. అవి వట్టి పుకార్లే అని తేలిపోయింది. అంత హ్యాండ్సమ్‌ అయినప్పటికీ ఈ హీరో ఎవరితోనూ రిలేషన్‌ ఉన్నట్టు ఎప్పుడు వార్తలు రాలేదు. అయితే మొదటి సారి యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సేతో రిలేషన్‌లో ఉన్నాడంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఈ సినిమా టైంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారని, రిలేషన్‌లో వారు ఎంతో దూరంగా వెళ్లిపోయారంటూ ఇన్‌సైడ్‌ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

వారిద్దరి సన్నిహిత్యం చూస్తుంటే అవి నిజమే అన్నట్టు అనిపిస్తుంది. ఆంధ్ర కింగ్‌ తాలుకా మూవీ ప్రమోషన్స్‌లో రామ్‌ భాగ్య శ్రీని తెగ పొగిడేశాడు. చాలా కాలం తర్వాత ఓ అచ్చమైన తెలుగమ్మాయి లాంటి అందం ఇండస్ట్రీకి వచ్చిందంటూ ఆమెను తెగ పొగిడేస్తున్నాడు. అంతేకాదు తమ మూవీ ప్రమోషన్స్‌ కోసం వీరిద్దరి ప్రత్యేకంగా అమెరికా వెళ్లారు. అక్కడ మూవీ ప్రమోషన్స్‌ కంటే వీరిద్దరి పర్సనల్‌ లైఫ్‌ ఎంజాయ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించింది. మరో షాకింగ్‌ విషయమేంటంటే కొద్ది రోజులుగా వీరిద్దరు లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉంటున్నారనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఇక వీరి ప్రేమ విషయంలో ఇద్దరి ఇంట్లోని తెలిసిందని, వారు పెళ్లికి కూడా ఒకే అన్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుస.

Also Read: Divvala Madhuri: మాట నిలబెట్టుకున్న దువ్వాడ కపుల్‌.. క్యాన్సర్ పెషేంట్‌కు బిగ్‌ బాస్‌ రెమ్యునరేషన్‌ పంపిణీ!

అమెరికాలో చట్టపట్టాల్‌

Advertisement

ఆంధ్ర కింగ్‌ తాలుకా ఎలాగు మంచి హిట్‌ అవుతుందని అభిప్రాయపడ్డ రామ్‌ ఫ్యామిలీ.. ఆ తర్వాత వీరిద్దరికి ముడి వేయాలని కూడా అనుకుందట. దీంతో బహిరంగంగా చెప్పకపోయిన మూవీ ప్రమోషన్స్‌ పేరుతో రామ్‌, భాగ్యశ్రీలు చట్టపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. దీంతో వీరిద్దరి పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని అంత ఫిక్స్‌ అయిపోతున్నారు. అయితే ఇప్పుడీ జంట మధ్య కాస్తా విభేదాలు వస్తున్నాయట. అదీ కూడా రామ్‌ ఫ్యామిలీ వల్ల అంటున్నారు. ప్రస్తుతం వీరి తీరు చూస్తుంటే నిజం అవుతాయనుకున్న డేటింగ్‌, పెళ్లి రూమర్స్‌.. వార్తలకే పరిమితం అయ్యేలా ఉన్నాయట. దీనికి కారణం రామ్‌ కుటుంబం భాగ్యశ్రీ అంటే ఇప్పుడు ముక్కు విరుస్తుందట.

త్వరలోనే బ్రేకప్‌?

ఆంధ్ర కింగ్‌ తాలుకా మూవీ ప్లాప్‌ అవ్వడంతో ఇది భాగ్యశ్రీ బ్యాడ్‌ లక్‌ వల్లే జరిగిందని రామ్‌ కుటుంబంఅభిప్రాయపడుతుందట. అన్‌ లక్కీ ఉన్న ఈ అమ్మాయి రామ్‌ లైఫ్‌లోకి వస్తే ఇక అతడికి సక్సెస్‌ రాదని ఆందోళన చెందుతున్నారట. అందుకే భాగ్య శ్రీతో పెళ్లంటే ప్రస్తుతం అయిష్టం చూపిస్తున్నారట. ఆంధ్ర కింగ్‌ తాలుకా బ్లాక్‌ బస్టర్‌ హిట్ అయితే వీరి రిలేషన్‌ని ఆఫీషియల్‌ చేసి ఘనంగా పెళ్లి చేద్దామనుకున్న వీరి ఆశలను మూవీ ప్లాప్‌ నిరాశ పరిచింది. దీంతో ఈ ఎఫెక్ట్‌ ఇప్పుడు భాగ్యశ్రీ ని నిరాకరించే వరకు వచ్చిందని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియదు. మరి ఈ వార్తలు నిజమవుతాయా? లేక రిలేషన్‌ ఆఫీషియల్‌ చేసి వీరు పెళ్లి పీటలు ఎక్కుతార తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×