E-Paper
Advertisement

Divvala Madhuri: మాట నిలబెట్టుకున్న దువ్వాడ కపుల్‌.. క్యాన్సర్ పెషేంట్‌కు బిగ్‌ బాస్‌ రెమ్యునరేషన్‌ పంపిణీ!

Divvala Madhuri: మాట నిలబెట్టుకున్న దువ్వాడ కపుల్‌.. క్యాన్సర్ పెషేంట్‌కు బిగ్‌ బాస్‌ రెమ్యునరేషన్‌ పంపిణీ!
Advertisement

Bigg Boss 9 Madhuri Remuneration: దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పొలిటిషియన్‌ దువ్వాడ శ్రీనివాస్‌తో రిలేషన్‌తో ఆమె మీడియా, సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. ఈ సోషల్‌ మీడియా కపుల్‌కి మంచి ఫాలోయింగ్‌ కూడా పెరిగింది. నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలిచే వీరు తాజాగా ఓ తమ ఉదారతతో తెరపైకి వచ్చారు. కాగా దివ్వెల మాధురి ప్రముఖ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె హౌజ్‌లో రచ్చ రచ్చ చేసింది.

హౌజ్‌లో రచ్చ

నా మాట శాసనమంటూ హౌజ్‌మేట్స్‌ కి చుక్కలు చూపించింది. బిగ్‌ బాస్‌కే బిగ్‌బాస్‌లా వ్యవహిరించిన ఆమె కదిలిస్తే చాలు అందరిపై నోరేసుకుని పడిపోయింది. ముఖ్యంగా రీతూ, డిమోన్‌లంది అన్‌హెల్దీ బాండింగ్ అంటూ ఒపెన్‌గా స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మరోవైపు తరచూ గొడవలతో సంజనలకు చుక్కలు చూపించింది. మిగతా వారితో కూడా ఏదోక సందర్భంగా గొడవలు పడుతూనే ఉంది. ఇందులో రీతూతో అయితే వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఈ విషయంలో హోస్ట్ నాగార్జున హెచ్చరించారు కూడా. అయినా తన తీరు మార్చుకోలేదు. అయితే మాధురి వల్లే 6 వారం నుంచి బిగ్‌ బాస్‌ షో రసవత్తరంగా మారింది. అప్పటి నుంచి ఈ షోకి టీఆర్‌పీ రేటింగ్‌ పెరిగింది. మాధురి చేస్తున్న రచ్చ, గొడవలను చూసేందుకు ఆడియన్స్‌ కూడా చూసేందుకు అమితాసక్తి చూపించారు.

వైల్డ్‌ కార్డుగా ఎంట్రీ

Advertisement

వైల్డ్ కార్డుతో వచ్చిన మాధురి అప్పటి వరకు పడుకున్న ఈ రియాలిటీ షోని అమాంత పైకి లేపిందనడం సందేహం లేదు. అయితే కొన్ని వారాలకే మాధురి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆరో వారంలో వచ్చిన ఆమె ఐదు వారాల్లోనే ఎలిమినేట్‌ అయ్యింది. అయితే బయటకు వచ్చాక పలు ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన మాధురి బిగ్‌ బాస్‌ రెమ్యునరేషన్‌ని పేదలకు పంచుతానని చెప్పింది. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌ కూడా అదే చెప్పారు. బిగ్‌ బాస్‌ వాళ్లు పారితోషికం ఎంత ఇస్తారో తెలియదు.. కానీ, వచ్చింది ఎంతైనా సేవ కార్యక్రమాలకే ఖర్చు పెడతామన్నారు. ఇక ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఈ మొత్తాన్ని పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి మరి తమ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజులు క్రితమే ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Also Read: Bigg Boss 9 Elimination: షాకింగ్‌ ట్విస్ట్.. ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్‌!

రూ. 1.10 లక్షలు విరాళం

Advertisement

ఇందులో అత్యవసరం ఉన్న పేదలను గుర్తించి వారిక అండగా నిలబడుతున్నారు. ఇందుకోసం స్వయంగా వెళ్లి మరి డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే బ్రెయిన్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి అస్పత్రి పాలయ్యారు. ఆయనను ఆసత్రి వెళ్లి మరి పరామర్శించి రూ. 80 వేలుఆర్థిక సహాయాన్ని అందించారు. అందులో రూ. 30 వేలు వైద్య ఖర్చుల కోసం కాగా, మిగతా రూ.50,000 కుటుంబ పోషణ నిమిత్తం ఇచ్చారు. ఈ రోజు పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళకు అండగా నిలిచారు. నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామం లో హెచ్‌ కుమారి అనే ఓ మహిళ ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతుంది. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఆమెకు తాజాగా రూ. లక్షా పదివేలు సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది చూసి వారి పెద్ద మనసుని కొనియాడుతున్నారు. వారి ఉదారతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×