E-Paper
Advertisement

AP 2029 Election Plan: 2029 ఎన్నికలకు పవన్ , లోకేష్ యాక్షన్ ప్లాన్‌

AP 2029 Election Plan: 2029 ఎన్నికలకు పవన్ , లోకేష్  యాక్షన్ ప్లాన్‌
Advertisement

AP 2029 Election Plan: కలిసుంటే..కలదు సుఖం…కమ్మని అభివృద్ధి సాధ్యం..! అవుతుంటే కలలు నిజం..అభ్యున్నతికి ఉండదు..ఆటంకం..! ఏపీలో కూటమి నేతలెవరిని తట్టినా…ఈ ఐక్యత పాటే…! ఇదే ఐక్యత మాటే వినిపిస్తోంది..! అభివృద్ధి ఆగొద్దంటే…నవ్యాంధ్ర అన్ని రంగాల్లో పురోగతి సాధించాలంటే..కూటమి కలిసే ఉండాలంటున్నారట. మరో 15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న బలమైన సందేశాన్ని కార్యకర్తలకు..జనాలకు పంపుతున్నారట. చూశారుగా…విన్నారుగా…డిప్యూటీ సీఎం ఏమన్నారో…కార్యకర్తలు, ప్రజలకు ఏం సందేశం పంపారో…! ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే యుద్ధానికి సిద్దమవుతున్నారు కూటమి నేతలు. 2029 ఎన్నికులకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా సెట్‌ చేస్తున్నారు.

2024 ఎన్నికల్లో కూటమి పార్టీల విజయం

2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి పార్టీలు సంచలన విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి 135 స్థానాలు, జనసేనకు 21 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. మొత్తంగా 164 ఎమ్మెల్యే స్థానాలను కూటమి పార్టీలు దక్కించుకుని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఏపీని వైసీపీ విధ్వంసం చేసిందంటూ కూటమి నేతలు..ఒక్కొక్క రంగాన్ని చక్కబెడుతున్నామని.. సందర్భం వచ్చిన ప్రతీసారి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమల ఏర్పాటు, విజన్ 2047 పేరుతో చేస్తున్న అభివృద్ధి, అమరావతి నిర్మాణంతో కూటమి పాలన జెడ్‌ స్పీడ్‌తో కొనసాగుతోంది. అయితే ఈ అభ్యున్నతి ఇలాగే కొనసాగాలంటే.. మొదలు పెట్టిన కార్యక్రమాలు సంపూర్ణం కావాలంటే.. కూటమి కలిసే ఉండాలన్న సందేశాన్ని జనానికి పంపుతున్నారు. ఈ క్రమంలో మరో 15 ఏళ్లు అధికారం ఇవ్వాలని ప్రజలను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్.. ఈ ప్రిపేరేషన్‌ ముందస్తుగానే ప్రారంభించారు.

సీఎం 15 ఏళ్ల అధికార నినాదం

Advertisement

డిప్యూటీ సీఎంతో పాటు.. సీఎం చంద్రబాబుది అదే నినాదం..15 ఏళ్లు అధికారం.. ఈ నెల 01వ తేదీన ఏలూరు జిల్లా నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు..15 ఏళ్ల అధికార నినాదాన్ని ప్రజలకు వినిపించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పదే పదే ఓ మాట చెబుతుంటారని సీఎం గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం మరో 15 ఏళ్లు ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆధికారంలో ఉండాలని పవన్‌ చెప్పిన మాటలను చంద్రబాబు ప్రస్తావించారు. చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవద్దంటే..కూటమికే మరో 15 అధికారం ఇవ్వాలని కోరారు.

మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్ష

సీఎం, డిప్యూటీ సీయమే కాదు..మంత్రి నారా లోకేశ్ సైతం ఇదే నినాదాన్ని ఎత్తుకున్నారు. కూటమి మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. అభివృద్ధి కొనసాగాలంటే…మూడు టర్మ్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సైకో పాలనతో రాష్ట్రం విధ్వంసం అయిందని..ఈ విధ్వంసాన్ని చక్కదిద్ది..అన్ని రంగాల్లో ఏపీ శాశ్వత అభ్యున్నతి సాధించాలంటే..డిప్యూటీ సీఎం పవన్ చెప్పినట్లు 15 ఏళ్లు ప్రజలు అవకాశం ఇవ్వాలని కార్యకర్తలు, ప్రజలను కోరారు.

పదవులు ఆక్షాకించే చోట విభేదాలు

Advertisement

చూశారుగా…ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కూటమి ప్రభుత్వ పెద్దలంతా ఒకే మాట మాట్లాడటం హాట్‌ టాపిక్‌గా మారింది. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగానే నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నా.. తమ సందేశం మాత్రం ఒక్కటే. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా దాదాపు మూడేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచి కార్యకర్తలను ఏకం చేయాలనే ప్రణాళికను కూటమి అగ్రనేతలు అమలు చేస్తున్నారు. పదే పదే 15 ఏళ్ల అధికారం సందేశాన్ని వారికి గుర్తు చేయడం ద్వారా..కూటమి ఐక్యతకు ఇబ్బందులు రాకుండా ఉండేలా చూసుకుంటున్నారట. ఒక కుటుంబంలోనే అనేక వివాదాలు.. విమ‌ర్శలు.. త‌గువులు ఉంటున్నాయి. అలాంటిది భిన్నమైన సిద్ధాంతాలు.. భిన్నమైన అజెండాల‌తో ఉన్న పార్టీల్లో ఇవి మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. అందులోనూ పదవులు ఆక్షాకించే చోట పలు విధానాలుగా నేతల మధ్య విభేదాలు తప్పనిసరి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్‌ పదేపదే ఇలా హితువు పలుకుతున్నారట.

ప్రజల్లోకి గుజరాత్‌ మోడల్‌ నినాదం

15 ఏళ్లు అధికారం అనే నినాదంతో.. ఒకరకంగా పార్టీ నాయకులను, కేడర్‌ను సమాయత్తం చేయడంతోపాటు…మరోవైపు గుజరాత్‌ మోడల్‌ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. గుజరాత్‌లో కంటిన్యూ ప్రభుత్వం నడుస్తున్న కారణంగానే ఆ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైందని వివరించే ప్రయత్నం చేస్తుస్తున్నారని టాక్. ఏపీలో కూడా కూటమికి 15 ఏళ్ల సమయం ఇవ్వాలని…దాంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు దోహదం అవుతుందని పదేపదే నేతలు ప్రస్తావిస్తున్నారట. సుదీర్ఘకాలం పాటు పాలనలో ఉంటామని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలను కూడా మానసికంగా సిద్ధం చేయడం కూడా ఒక వ్యూహంగా అమలు చేస్తున్నారట. ఈ కూటమే ఏపీకి భవిష్యత్తు అనే భావనను ప్రజల్లో బలంగా నాటుకునేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తుందట.

టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య లోపిస్తున్న సఖ్యత

ఈ ఐక్యత రాగం వెనుక.. మరో బలమైన కారణం ఉందని చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య అప్పుడప్పుడు సఖ్యత లోపిస్తుండటంతో…వారి మధ్య విభేదాలను అధిగించేందుకే ఈ 15 ఏళ్ల అధికారం నినాదాన్ని వినిపిస్తున్నారని టాక్. కూటమి నాయకులను ఒకేతాటిపై నడిపించడానికి.. తద్వారా మరోసారి అధికారం కోసం కలిసి పనిచేయాలన్న బలమైన కోరికను కలిగించేందుకు ఈ నినాదం ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి కూటమి నేతలు చేస్తున్న 15 ఏళ్ల అధికారం నినాదం..ఏ మేరకు పనిచేస్తుంది. కూటమి కార్యకర్తలు ఈ నినాదాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్తారో వేచి చూడాలి.

Story By Kishan, Big Tv 

 

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×